+91 9704053369

Contact Us

android

IOS

Taurus Yearly Predictions

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర వృషభ రాశి గోచార ఫలము

కృత్తిక 2,3,4 పాదము, రోహిణి 1,2,3,4 పాదము, మృగశిర 1,2 పాదము, ఈ, ఉ, ఏ, ఓ, వా, వీ, వు, వే, వో అక్షరాలు కలసి వృషభ రాశి ఆగును.ద్వంద్వాక్షర పేర్లు : స్వామి, స్వప్న, స్వాతి, స్వేత, శ్వేత, వైకుంఠం,వృధ, తృణ, సృవతి, సృజన, శృతి, వైష్ణవి ఋష్యశృంగ ద్వాలి, ద్వని .మంగళవారం ఘాతవారం. ఆధాయం 14, వ్యయం 11, రా.పూజ్యం 06, అవమానం 01

ఈ వృషభ రాశి వారి జాతక లక్షణాలు మంచి సౌంధర్య వంతులు. మంచి వాక్కు, వీపునందుగాని, ప్రక్కలోగాని పుట్టుమచ్చగలవారు. బాధకోర్చువారు. ప్రతి పనియందు శ్రద్ధ పూపును. బంధుప్రియుడు, బోగభాగ్యముతో తుదూగును. స్నేహశీలి, స్త్రీయందు ప్రేమగలవారు. కొద్ది స్థూల శరీరము గలవారుగును. యవ్వన వార్ధక్యముందు సుఖము అనుభవించును. పర స్త్రీల యందు ప్రేమ, స్వత తెలివితేటతో మంచి అభివృద్ధిలోనికి వచ్చును.
ఈ రాశి జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి 19-11-2020 గురువారము వరకు గురుడు 8 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో" చోరగ్ని వృషబీతిచ్చ గాంభీర్యం గాత్ర నాశనం! నిష్థూరం సహసం కార్యం అష్ణమాస్తే భవేద్గురౌ !!

చోరుల వలన అగ్ని వలన భయము పోలీసులపల్ల భయము శరీరము కళాహీనము యగుట అధైర్యము, కఠినముగా మాట్లాడుట కోపముసు ప్రదర్శించుట హద్ధుమీరి నడుచుట రోగ భయము స్థానమార్పు ఉద్యోగులకు బదిలీ సమస్యలు గాని అవినీతి ఆరోపణలుగాని ఎదుర్కుంటారు కుటుంబ చిక్కులు, ఆర్దిక ఇబ్బందులు, అనుకున్న పనులు వాయిదా పడటము జరుగును, ప్రయాణములో చాలా జాగ్రత్త అవసరము. బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.
ఈ జాతకులకు 20-11-2020 గురువారము నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు గురుడు 9 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో॥ అర్ధంచస్వకులాచారం గృహలాభం సుభోజనం। నిత్య స్త్రీ జన సంపర్కం నవమాస్థే భవేద్గురౌ ॥

గృహలాభము, కులాచారము యందు శ్రద్ధ ధనలాభము అయాచితముగా ధనము లభించుట పరస్త్రీ సౌఖ్యము మంచి భోజనము సంతోషముగా జీవించుట బుద్ధి బలము సొంతగ్రామము యందు సౌఖ్య జీవనము మనస్సున తలచిన పనులు నెరవేరుట ఆరోగ్యము పశు ధాన్యలాభము తండ్రికి ఆరోగ్యము కలుగుట పిత్రార్జిత ఆస్థి కలసి వచ్చుటయు జరుగును. మీకు నరదిష్ఠి ఉన్నది నరఘోషయంత్రము ఇంట్లో ప్రతిష్ఠించుకొండి.
ఈ జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు శని9 స్థానంలోను ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును .


శ్లో|| శోకరోఘం మహాదుఃఖం ఖక్వచిద్ర్ధవ్యం! క్వచిత్సుఖం దారాసుతాదిక్షేశంచ నవమశ్థే యదాశనౌ!

శని ప్రభావము కొంత తగ్గుసు. రాజకీయ వ్యవహారములలో జయము, ఆరోగ్యము కలుగుటయు తేజము, ధనధాన్య లాభము తలచిన పనులు నెరవేరుటయు సంఘములో మంచిపేరు వచ్చుటయు ఉద్యోగస్థులకు ఉద్యోగం లభిచుటయు జరుగును . శనేశ్వరుడు శాంతించుటకు 1 1/4 కిలొ నువ్వులు , 9*5 నీలిరంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.

అన్ని వృత్తులవారికి ఆనందదాయకం. అన్ని వృత్తులవారికి ఈ సంవత్సరము మధ్యమ ఫలితము ఉండును. డాక్టరు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటీనటులు ఘణసన్మానములు అందుకొనును. నాట్యకళా రంగస్ధల మరియు వేదపండితులు ఘణసణ్మనములు పొందును. విద్యార్దులకు మంచి ఫలితాలు ఉండుసు. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.

కృత్తిక వారికి లక్కీ నెంబర్లు 1-9-6, లక్కీ స్టోన్‌ కెంపు ఉంగరం ధరించాలి. రోహిణి వారికి లక్కీ నెంబర్లు 2-6, లక్కీ స్టోన్‌ ముత్యం ఉంగరం ధరించాలి. మృగశిర వారికి లక్కీ నెంబర్లు 9-6-5, లక్కీ స్టోన్‌ పగడం ఉంగరం ధరించాలి. లక్కీ వారం ఆదివారం. ఈ రాశి వారందరికి శని, మంగళవారం ఘాతవారాలు, మీరు పూజించే భగవంతుని నామం శ్రీకృష్ణ పరమాత్ముడు.
ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయనమ: రోజుకు 27 సార్లు పఠించండి అన్ని విధాల శుభం .
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహ స్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః ॥ (కృత్తిక 2పా)
శ్లో॥ అజ సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్చుతః ॥
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః ॥ (కృత్తిక 3 పా)
శ్లో॥ వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః।
అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః॥ (కృత్తిక 4 పా)
శ్లో॥ రుద్రో భహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః ।
అమృత శ్శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః ॥ (రోహిణి 1పా)
శ్లో॥ సర్వగ స్సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్దనః ।
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ (రోహిణి 2 పా)
శ్లో॥ లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః।
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః॥ (రోహిణి 3పా)
శ్లో॥ భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సమిష్ణు ర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పురర్వసుః ॥ (రోహిణి 4 పా)
శ్లో॥ ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః ।
అతీన్ద్ర స్సంగ్రహ స్సర్గో ధృతాత్మా నియమోయమః ॥ (మృగ 1 పా)
శ్లో॥ వేద్యో వైద్య స్సదా యోగీ వీరహా మాధవో మధుః ।
అతీన్రిర్దయో మహామాయో మహోత్సాహోమమాబః ॥ (మృగ 2 పా)