+91 9704053369

Contact Us

android

IOS

Leo Yearly Predictions

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర సింహ రాశి గోచార ఫలము

మాఘ 1,2,3,4 పాదము, పుబ్బా 1,2,3,4 పాదము, ఉత్తర 1వ పాదం మా, మి, ము, మే, మో, ట, టి, టూ, టే అక్షరాు కసి సింహరాశి ఆగును. ద్వంద్వాక్షర పేర్లు : మైనావతి, మౌనిశ్వర్‌, మౌక్తికము, స్మైల్‌, స్టాల్‌, ష్టల్‌
శనివారం ఘాతవారం.ఆధాయం 14, వ్యయం 2, రా.పూజ్యం 1, అవమానం 7


ఈ రాశివారి జాతక లక్షణాలు అమరశీుడు. విశామైన ముఖవర్చస్సు గలవారు. గుండ్రని ముఖము కలవారు. స్వల్ప సంతానము కలవారు. స్త్రీ యందు కోపము, మధుమాంసముయందు ఇష్టము గలవారు. మంచి పనులు, ధర్మ కార్యము చేయువారు. పరాక్రమవంతుడు, నిశ్చమైన, పవిత్రమైన మనస్సు గలవారు. తల్లిదండ్రుల మాట, గురువుల మాట, పెద్ద మాట వినువారు. శ్రీమంతునివలె కన్నించును. పిండి వంటలు, మధుర పదార్థాములు భుజించువారు. చదువుల యందు శ్రద్ధ, పూతోటు, బృందావనం అంటే ఇష్టం కలవారు. సదాచారవంతులు, ఆధ్యాత్మిక చింతనగలవారు. జ్యోతిష్యం వాస్తు ప్రశ్నబాగం వైద్యం భగవద్గీత తెలిసిన వారు అగును.
ఈ సింహ రాశి జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి 19-11-2020 గురువారము వరకు గురుడు 5 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో || అర్ధలాభం తదైశ్వర్యం, కర్మరతిహర్షతమ్ | సదాస్వజన సౌఖ్యంచ, పంచమాస్తే భవేద్గురౌ ||

సంతానాభివృద్ధి కలుగుట, సంతానమునకు శుభకార్యములు జరుపుట, ధనలాభము కలుగుట, మంత్రసిద్ధి కలుగుట, అయాచితముగా సంపద వచ్చుటయు వృత్తి ఉద్యొగ వ్యాపారాదుల యందు అభివృద్ధి యు , పై అధికారుల మన్నలను పొందుట, కుతుంబముతో మహా సంతోషముతొ ఉండుట దేవతా కార్యములు జరిపించుట మొదలగు శుభ ఫలితములు కలుగును .
ఈ జాతకులకు 20-11-2020 గురువారము నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు గురుడు 6 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో "ధారపుత్ర విరోధశ్చ స్వజనే కలహం స్తదా! చోరాగ్ని నృప్ర భీతిశ్చ షష్టమాష్తేభవే ద్గురౌ" !!

చేయువృత్తి ఉద్యోగ, వాపారాదుల యందు అభివృధ్ధి ఆగిపోవుట స్వజసులతో విరోదము, శత్రుసంఖ్య పెరుగుట చోర, అగ్ని, రాజ భయము కలుగుట అపకీర్తి మనస్థపము వేళకు భోజనము చేయలేక పోవుటయు అనారోగ్యము సంభవించుటయు శరీరమున వాతరోగము ప్రభలుటయు తలచిన కార్యములు చెడిపోవుటయు మొదలగు చెడు ఫలితములు కలుగును . బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.
ఈ జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు శని6 స్థానంలోను ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును .


శ్లో.ధనధాన్యాది వృద్ధ్యంచ్చ బంధు సంతోష వర్ధనం. స్త్రీసౌఖ్యం గృహనిర్మాణం షష్ఠమాస్తానకే శనౌ.

ఆరోగ్యవృద్ధి తలచిన పనులు నెరవేరుటయు నూతన గృహనిర్మాణము చేపట్టుటయు బందుమిత్రల సంతోషము , స్త్రీ సౌఖ్యము, సంతోషము, సౌభాగ్యము, శరీరబలము, కీర్తి, ప్రజలలో పలుకుబడి పెరుగుటయు, విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అగుటయు జరుగును.

అన్ని వృత్తుల వారికి ధనలాభం కలుగును. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానము అందుకోనును. నాట్యకళా రంగస్థల మరియు వేదపండితులు ఘణసన్మానము పొందును. విద్యార్ధులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.

మఖ నక్షత్రం వారికి లక్కీ నెం.7, లక్కీ స్టోన్‌ వైఢూర్యం ధరించాలి, పుబ్బవారికి లక్కీ నెం.6, లక్కీ స్టోన్‌ వజ్రము ధరించాలి. ఉత్తర వారికి క్కీ నెం.5 క్కీ స్టోన్‌ కెంపు ఉంగరం ధరించాలి. సింహరాశి వారందరికీ బుధ, గురు, శుక్రవారము మంచిది. శనివారం ఘాత. మీరు నిత్యం పూజించే భగవంతుని నామం ఓం క్లీం బ్రహ్మణే జగదాదాయ నమ: . ఈశ్లోకము పఠించుట వలన మీకు అఖండ ఆయురారోగ్యం, ఇష్ట కార్యసిద్ధి భయబ్రాంతులు, నరజిష్ఠి, శూద్రప్రయోగము దూరమగును. అన్ని విధముల మేలు జరుగును.
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః।
అనుకూ శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ (మఘ 1 పా)
శ్లో॥ పద్మనాభో2 రవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్‌ ।
మహర్ధిః బుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః॥ (మఘ 2 పా)
శ్లో॥ అతుశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।
సర్వ క్షణ క్షణ్యో క్ష్మీవాన్‌ సమితిఞ్జయః॥ (మఘ 3 పా)
శ్లో॥ విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర స్సహః ।
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ (మఘ 4 పా)
శ్లో॥ ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ (పుబ్బ 1 పా)
శ్లో॥ వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ద్రువః।
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ (పుబ్బ 2 పా)
శ్లో॥ రామో విరామో విర (జో) మార్గో నేయో నయో2 నయః ।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదత్తమః ॥ (పుబ్బ 3 పా)
శ్లో॥ వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ (పుబ్బ 4 పా)
శ్లో॥ ఋతుస్సుదర్శనః కాః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ ః ॥ (ఉత్తర 1 పా)