+91 9704053369

Contact Us

android

IOS

Sagittarius Yearly Predictions

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర ధనుస్సు రాశి గోచార ఫలము

మూల 1,2,3,4 పాదము, పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. యే, యో, బా, బీ, బు, ధా, భా, ఢ, బే అక్షరాలు కలిపి ధనస్సు రాశి అగును. ద్వంద్వాక్షర పేర్లు : శ్యామల, శ్యాంసుందర్‌, చ్యవనావతి, చ్చవన్‌, చ్యుతి, జ్యోతి, భీముడు, భైరవుడు, భోగిశ్వర్‌, ధూర్జటి, ధ్వజేందర్‌, ధ్యానుడు, ధృతరాష్ట్రుడు, ధృపదుడు.
శుక్రవారం ఘాతవారం. ఆధాయం 8, వ్యయం 11, రా.పూజ్యం 6, అవమానం 3


ఈ రాశివారి జాతక లక్షణాలు ప్రసన్నమైన ముఖము కలవారు. దివ్యమైన తేజస్సు కలవారు. తాతగారి, తండ్రిగారి ధనము గలవారు. ఆధ్యాత్మిక దైవచింతన కలవారు. ధనవంతుడు, గుణవంతుడు, బుద్ధివంతుడు, త్యాగబుద్ధికవాడు. ఆటపాటలందు, మాటలలో నేర్పరికలవారు. మంచి సద్గ్రందపఠనా శక్తి గలవారు. సుగంధ ద్రైవములందు ఇష్టము కలవారు. ధర్మమార్గమందు నడుచుకొనువారు. బలత్కారమున స్వాదీనపడువారు. మంచిపేరు ప్రఖ్యాతులు పొందుతారు. అందరికీ ఇష్టమైన వారు పెద్దపెద్ద విద్వాంసుతో, వేదపండితులతో పరిచయం కలవారు. చిత్రలేఖ, శిల్పి, హస్త కళాకారుడు అగును.
ఈ ధనుస్సు రాశి జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి 19-11-2020 గురువారము వరకు గురుడు 1 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో. రాజకోపం యశోహాణి ఉద్యోగం విరోధకం. రోగార్థి బంధువైర్యంచ్చ వ్యసనం జన్మకే గురౌ.॥

శుభ కార్యక్రమములు చేయుట వలన ధన వ్యయము పాడి పరిశ్రమ అనుకూలించక పోవుట స్థానచలనము ఉద్యోగులకు బదిలీలు తరుచు ప్రయాణము అప్పు చేయుట మలిన వస్త్రధారణ చేయుట మరియు కుటుంబ చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నవి వాయిదాపడుట మనకు రావలసిన డబ్బు రాకపోవడం, ఇచ్చేకాడ సతాయించడం జరుగును. ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవడం అనారోగ్యము, మీతో సహాయ సహాకారము పొందిన వారు మీకు శత్రువులు అగుదురు.
06-04-2019 శనివారం నుండి 25-01-2020 శనివారం వరకు శని 1వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు


శ్లో.మనస్సౌక్యైం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమః. ధర్మవ్యయం మనసౌఖ్య ద్వితీయస్థానకే గురౌ.॥

నేత్ర సంబంధమైన బాధతొలుగును. మనస్సున ఆనందము, ఇతరు వద్ద పలుకుబడి పెరుగుట ధనలాభము కలుగుట మనస్సున తలచిన పనులు నెరవేరుట ధర్మ కార్యములు చేయుట మొదలగు శుభఫలితము కలుగును . అనుకున్నవి సాధించుట ఇంట్లో శుభకార్యాలు చేయుట ఇతరుల శుభాకార్యాలు జరిపించుట. భూమికొనడం లేక అమ్మడం గృహనిర్మాణం చేస్తారు.
ఈ జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు శని2 స్థానంలోను ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును .


శ్లో॥ సదాక్లేశం వృదావైరం సతతం కార్యనాశనం। సంచారం స్వజనం ధ్వేషం పాపచింతన ధనే శనౌ ॥

ఎల్లప్పుడు విచారము అనవసరముగా కలహము కలుగుట చోరులు చేత అగ్ని చేత భయము ముఖము యందు కళ తగ్గిపోవుట అదైర్యము ఇతరులతో కఠినముగా మాట్లాడుట అమితమైన కోపము కలుగుట నేత్ర సంబంద సమస్యలు కలుగుట కుటుంబ సభ్యుతో వైరము కలుగుట, గౌరవ భంగము కలుగుట ప్రయత్నించిన పనులు ఆగిపోవుట బంధు మిత్రవిరోధము మొదలగు చెడుఫలితములు కలుగును.
అన్ని వృత్తులవారికి ఈ సంవత్సరము మధ్యమ ఫలితము ఉండును. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానము అందుకోనును. నాట్యకళా రంగస్థల మరియు వేదపండితులు ఘణసన్మానము పొందును. విద్యార్ధులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.


మూల వారికి లక్కీ నెంబర్‌ 7, లక్కీ స్టోన్‌ వైఢూర్యం, లక్కీ వారం గురువారం. పూర్వాషాఢ వారికి లక్కీ నెంబర్‌ 6-3, లక్కీ స్టోన్‌ వజ్రం, లక్కీ వారం గురువారం.ఉత్తరాషాఢ వారికి లక్కీ నెంబర్‌ 1-3-8, లక్కీ స్టోన్‌ కెంపు, లక్కీ వారం ఆదివారం, శుక్రవారం ఘాత. మీరు పూజించే భగవంతుడు ఓం శ్రీం దేవ కృష్ణాయ ఊర్ధ్వ దంతాయనమ: రోజుకు 27 సార్లు చదువండి.
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ స్తవ్యస్త్సవప్రియ స్త్సోత్రం స్తుతి స్త్పోతా రణప్రియః। పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః ॥ (మూ 1 పా)
శ్లో॥ మనోజవ స్తీర్ధకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ (మూ 2 పా)
శ్లో॥ సద్గతి స్సత్కృతిస్సత్తా సద్భూతి స్సత్పరాయణః (మ్‌) ।
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామున ః ॥ (మూ 3 పా)
శ్లో॥ భూతవాసో వాసుదేవః సర్వాసునియో2 నః ।
దర్పహా దర్బదో దృప్తో దుర్ధరో2 థాపరాజితః ॥ (మూ 4 పా)
శ్లో॥ విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్‌ ।
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాపనః ॥ (పూర్వాషాఢ 1 పా)
శ్లో॥ ఏకోనైన స్సవః కః కిం యత్తత్పద మనుత్తమమ్‌ ।
లోకబన్ధు ర్లోకనాథో మాధవో భక్తవత్సః ॥ (పూర్వాషాఢ 2 పా)
శ్లో॥ సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ ।
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచశ్చః ॥ (పూర్వాషాఢ 3 పా)
శ్లో॥ అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్‌ ।
సుమేధా మేధజో ధన్యః సత్యవేధా ధరాధర ః॥ (పూర్వాషాఢ 4 పా)
శ్లో॥ తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగోగదాగ్రజః ॥ (ఉత్తరాషాఢ 1 పా)