+91 9704053369

Contact Us

android

IOS

Cancer Yearly Predictions

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర కర్కాటక రాశి గోచార ఫలము

పునర్వసు 4వ పాదం, పుష్యమి 1,2,3,4 పాదాలు, ఆశ్లేష 1,2,3,4 పాదాలు హు, హే, హో, డ, డీ, డు, డే, డో అక్షరాలు కలసి కర్కాటక రాశి అగును. ద్వంద్వాక్షర పేర్లు : హిమావతి, హేమత, హైమావతి, డిక్కమ్మ, డుక్కమ్మ, డేగమ్మ, డొుకమ్మ
బుధవారం ఘాతవారం.ఆధాయం 11, వ్యయం 8, రా.పూజ్యం 5, అవమానం 4


ఈ మిధున రాశి జాతకుల లక్షణాలు స్త్రీ యందు ప్రేమాభిమానము గలవారు. కామశాస్త్రం యందు శ్రద్ధ చూపు వారు. బుద్ధి చపలచిత్తం, హాస్యప్రియుడు, నవ్వు ముఖము గలవారు. దీర్ఘమైన నాసికము కలవారు. తల్లిదండ్రులను, గురువును పూజించువారు.
ఈ కర్కాటక రాశి జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి 19-11-2020 గురువారము వరకు గురుడు 6 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో "ధారపుత్ర విరోధశ్చ స్వజనే కలహం స్తదా! చోరాగ్ని నృప్ర భీతిశ్చ షష్టమాష్తేభవే ద్గురౌ" !!

చేయువృత్తి ఉద్యోగ, వాపారాదుల యందు అభివృధ్ధి ఆగిపోవుట స్వజసులతో విరోదము, శత్రుసంఖ్య పెరుగుట చోర, అగ్ని, రాజ భయము కలుగుట అపకీర్తి మనస్థపము వేళకు భోజనము చేయలేక పోవుటయు అనారోగ్యము సంభవించుటయు శరీరమున వాతరోగము ప్రభలుటయు తలచిన కార్యములు చెడిపోవుటయు మొదలగు చెడు ఫలితములు కలుగును . బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.
ఈ జాతకులకు 20-11-2020 గురువారము నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు గురుడు 7 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో "రాజుదర్శనమారోగ్యం గాంభీర్యం గాత్రపోషణం! అభిప్టకార్యసిద్దిచ్ఛ సప్తమాస్తే భవేద్గు రౌ "!!

రాజకీయ వ్యవహారములలో జయము, ఆరోగ్యము కలుగుటయు తేజము, ధనధాన్య లాభము తలచిన పనులు నెరవేరుటయు సంఘములో మంచి పేరు వచ్ఛుటయు ఉద్యోగాస్తులకు ఉద్యోగము లభించుటయు వివాహము కాని వారికి వివాహము జరుగుటయు మొదలగు శుభ ఫలితములు కలుగును . అన్ని వృత్తులవారికి ఆనందదాయకం.
ఈ జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు శని7 స్థానంలోను ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును .


శ్లో.వ్యాధిపీడ ప్రవాసంచ అంతక్లేశం మహద్భయం. అపమృత్యు భయం ప్రాప్తి అర్థాష్టమ స్థానకే శనౌ.

శుభ కార్యక్రమములు చేయుట వలన ధన వ్యయము పాడి పరిశ్రమ అనుకూలించక పోవుట స్థానచనము ఉద్యోగుకు బదిలీలు తరుచు ప్రయాణము అప్పు చేయుట మలిన వస్త్రధారణ చేయుట మరియు కుటుంబ చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నవి వాయిదాపడుట మనకు రావసిన డబ్బులు రాకపోవుడం ఇచ్చేకాడ సతాయించడం జరుగును . ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవడం అనారోగ్యము కలుగును. శనేశ్వరుడు శాంతించుటకు 1 1/4 కిలొ నువ్వులు , 9*5 నీలిరంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.

అన్ని వృత్తల వారికి ఈ సంవత్సరము మధ్యమ ఫలితము ఉండును. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానములు అందుకోనును. నాట్యకళా రంగస్థల మరియు వేదపండితలు ఘణసన్మానము పొందును. విద్యార్ధులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.

పునర్వసు వారికి లక్కీ నెంబర్లు 2-5-3, లక్కీ స్టోన్‌ కనకపుష్పరాగం ఉంగరం ధరించాలి. పుష్యమి వారికి లక్కీ నెంబర్లు 2-8, లక్కీ స్టోన్‌ ఇంద్రనీలం ఉంగరం ధరించాలి. ఆశ్లేష వారికి లక్కీ నెంబర్లు 5-2, లక్కీ స్టోన్‌ జాతి పచ్చ ఉంగరం ధరంచాలి. కర్కాటక రాశి వారికి బుధవారం ఘాత.
మీరు పూజించే భగవంతుడు శ్రీమన్నారాయణ. ఓం నమోనారాయణాయ రోజుకు 27 సార్లు పఠించాలి.

మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః ।
వర్ధనోవర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః ॥ (పునర్వసు 4 పా)
శ్లో॥ సుభుజో దుర్దరో వాగ్మీ మహేన్ద్రో వసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ (పుష్యమి 1 పా)
శ్లో॥ ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
బుద్ధఃస్పష్టాక్షరో మన్త్రఃచన్ద్రాంశుర్భాస్కరుద్యుతిః ॥ (పుష్యమి 2 పా)
శ్లో॥ అమృతాంశూద్భవో భానుః శశబిన్దుస్సురేశ్వరః ।
ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః ॥ (పుష్యమి 3 పా)
శ్లో॥ భూతభవ్య భవన్నాథః పవనః పావనో2 సః ।
కామహాకామకృత్కాస్తః కామః కామప్రదః ప్రభు ః ॥ (పుష్యమి 4 పా)
శ్లో॥ యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యో2వ్యక్తరూపశ్చ సహస్త్రజిదనన్తజిత్‌॥ (ఆశ్లేష 1 పా)
శ్లో॥ ఇష్టా2 విశిష్ట శ్శిష్టేష్టః శిఖణ్డీ సహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధర ః॥ (ఆశ్లేష 2 పా)
శ్లో॥ అచ్యుతఃప్రథితః ప్రాణః ప్రాణదో వాసనానుజః ।
అపాంనిధి రధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః ॥ (ఆశ్లేష 3 పా)
శ్లో॥ స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః।
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః॥ (ఆశ్వేష 4 పా)