+91 9704053369

Contact Us

android

IOS

Aquarius Yearly Predictions

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర కుంభ రాశి గోచార ఫలము

ధనిష్ట 3,4 పాదము, శతభిష: 1,2,3,4 పాదము, పూర్వాభాద్ర 1,2,3 పాదము. గూ, గే, గో, సా, సి, సూ, సే, సో, దా అక్షరాలు కలిపి కుంభరాశి అగును. ద్వంద్వాక్షర పేర్లు : దైవజ్ఞ, దైత్యుడు, దౌహితృడు
గురువారం ఘాతవారం. ఆధాయం 11, వ్యయం 5, రా.పూజ్యం 5, అవమానం 6


ఈ రాశివారి జాతక లక్షణాలు సుదీర్ఘమైన, సుందరమైన మెడలు కలిగి, అందమైన శరీరము, సుందరముగా, ఆనందముగా ఉండును. కొన్ని సంవత్సరాలు ధన సంపతితోను, మరికొన్ని సంవత్సరాలు దరిద్రముతోను ఉండును. పుణ్యక్షేత్రము, గార్డెన్‌, పూ తోటు, బృందావనం అంటే చాలా ఇష్టము కలవారు. మంచి స్నేహం కలవారు. సాదు సత్పురుషుతో మంచి పేరున్న వ్యక్తులతో పరిచయం. దీర్ఘముగా ఆలోచించువారు అగును.
ఈ కుంభ రాశి జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి 19-11-2020 గురువారము వరకు గురుడు 11 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో. యశోవృద్ధి బలంతేజః సర్వత్ర విజయం స్సుఖం. శేతృహం తిరుమంత్రం సిద్ధిః ఏకాదశ స్థాకే గురౌ॥

గృహలాభము, కులాచారము యందు శ్రద్ధ ధనలాభము అయాచితముగా ధనము లభించుట పరస్త్రీ సౌఖ్యము మంచి భోజనము సంతోషముగా జీవించుట బుద్ధి బలము సొంతగ్రామము యందు సౌఖ్య జీవనము మనస్సున తలచిన పనులు నెరవేరుట ఆరోగ్యము పశు ధాన్యలాభము తండ్రికి ఆరోగ్యము కలుగుట పిత్రార్జిత ఆస్థి కలసి వచ్చుటయు జరుగును . ఈ జాతకులకు 20-11-2020 గురువారము నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు గురుడు 12 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.

శ్లో. శుభమూలే వ్యామోహం ఛైవ ప్రాణవిక్రయ ధూషణం. స్థానభ్రష్టంచ దారిద్య్రయం ద్వాదశ స్థానే గురౌ॥

శుభ కార్యక్రమములు చేయుట వలన ధన వ్యయము పాడి పరిశ్రమ అనుకూలించక పోవుట స్థానచలనము ఉద్యోగులకు బదిలీలు తరుచు ప్రయాణము అప్పు చేయుట మలిన వస్త్రధారణ చేయుట మరియు కుటుంబ చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నవి వాయిదాపడుట మనకు రావలసిన డబ్బు రాకపోవడం , ఇచ్చేకాడ సతాయించడం జరుగును. ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవడం అనారోగ్యము, మీతో సహాయ సహాకారము పొందిన వారు మీకు శత్రువులు అగుదురు. బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు. ఈ జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు శని12 స్థానంలోను ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును .

శ్లో. మనహాని మనః క్లేశం కృషి ర్భోజన మ్పషం. నిత్యసంసార దారిద్య్రం ద్వాదశ స్థానకే శనౌ॥

సంపాదన తగ్గును ఖర్చుపెరుగును. ఆర్థిక ఇబ్బందులు అధికమగును. ధనహాని, వృధాప్రయాస, అనుకున్న పనులు కాకపోవుట, ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవుట, ఇంట్లో అనారోగ్యబాధలు, మిత్రుతో విరోధాలు, చెయ్యనినేరాలు మీదపడుట మొదలగు దృష్పలితాలు కలుగును. శనేశ్వరుడు శాంతించుటకు 1 1/4 కిలొ నువ్వులు , 9*5 నీలిరంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.
విద్యార్ధులకు మంచి ర్యాంక్ , ఉద్యోగస్తులకు కృషి ముఖ్యం , వ్యాపారస్తులకు స్వల్ప లాభం,డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానము అందుకోనును. నాట్యకళా రంగస్థ మరియు వేదపండితులు ఘణసన్మానము పొందును.


ధనిష్ఠ వారికి లక్కీ నెంబర్‌లు 8-9, లక్కీ స్టోన్‌ పగడం ఉంగరం ధరించాలి. శతభిషం వారికి లక్కీ నెం.8-4, లక్కీ స్టోన్‌ గోమేధికం ఉంగరం ధరించాలి. పూర్వాభాద్ర వారికి లక్కీ నెం.8-3, లక్కీ స్టోన్‌ పుష్పరాగం. లక్కీ వారం శుక్రవారం. గురువారం ఘాత. మీరు నిత్యం పూజించే భగవంతుడు శ్రీమన్నారాయణుడు. ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమ: రోజుకు 27 సార్లు పఠించాలి
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ భారభృత్‌ కథితో యోగీ యోగీశ స్సర్వ కామదః ।
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సువర్ణో వాయు వాహనః ॥ (ధనిష్టా 3 పా)
శ్లో॥ ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా22దమః ।
అపరాజిత స్సర్వసహో నియన్తా22 నియమో2 యమః ॥ (ధనిష్టా 4 పా)
శ్లో॥ సత్త్వవాన్‌ సాత్విక్‌ స్సత్యః సత్యదర్మ పరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్‌ ప్రీతివర్దనః ॥ (శతభిష 1 పా)
శ్లో॥ విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః ।
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః॥ (శతభిషం 2 పా)
శ్లో॥ అనన్తో హుతభుగ్భోక్తా సుఖదో నైకజో2 గ్రజః ।
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః ॥ (శతభిషం 3 పా)
శ్లో॥ సనా త్సనాతనతమః కపిః కపిరవ్యయః ।
స్వస్తిద స్స్వస్తికృత్‌ స్వస్తి స్వస్తిభుక్‌ స్వస్తిదక్షిణః ॥ (శతభిషం 4 పా)
శ్లో॥ అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమూర్జిత శాసనః ।
శబ్దాతిగ శ్శబ్దసహః శిశిర శ్శర్వరీకరంః ॥ (పూర్వాభాద్ర 1 పా)
శ్లో॥ అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యోశ్రవణ కీర్తనః ॥ (పూర్వాభాద్ర 2 పా)
శ్లో॥ ఉత్తారణో దుష్క ృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః ।
వీరహా రక్షణ స్సన్తో జీవనః పర్యవస్థితః ॥ (పుర్వాభాద్ర 3 పా)