+91 9704053369

Contact Us

android

IOS

Gemini Yearly Predictions

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర మిధున రాశి గోచార ఫలము

మృగశిర 3, 4 పాదము, ఆరుద్ర 1, 2, 3, 4 పాదము, పునర్వసు 1, 2, 3 పాదము కా, కీ, కూ, ఘ, జ్ఞ, ఛ, కే, కొ, హ అక్షరాలు మిధున రాశి అగును. సోమవారం ఘాతవారం. ద్వంద్వాక్షర పేర్లు : కౌంశికుడు, కౌంసల్యా, కైకేయి, కైక, కృష్ణుడు కృష్ణమూర్తి కృష్ణ కృపాకర్‌, క్రాంతికుమార్‌, జ్ఞానేందర్‌, జ్ఞానేశ్వరి, కైంకరి, కైలాసం, జ్ఞాని మిధునరాశి అగును
ఆధాయం 02, వ్యయం 11, రా.పూజ్యం 02, అవమానం 04


ఈ మిధున రాశి జాతకుల లక్షణాలు స్త్రీ యందు ప్రేమాభిమానము గలవారు. కామశాస్త్రం యందు శ్రద్ధ చూపు వారు. బుద్ధి చపలచిత్తం, హాస్యప్రియుడు, నవ్వు ముఖము గలవారు. దీర్ఘమైన నాసికము కలవారు. తల్లిదండ్రులను, గురువును పూజించువారు.
ఈ మిధున రాశి జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి 19-11-2020 గురువారము వరకు గురుడు 7 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో "రాజుదర్శనమారోగ్యం గాంభీర్యం గాత్రపోషణం! అభిప్టకార్యసిద్దిచ్ఛ సప్తమాస్తే భవేద్గు రౌ "!!

రాజకీయ వ్యవహారములలో జయము, ఆరోగ్యము కలుగుటయు తేజము, ధనధాన్య లాభము తలచిన పనులు నెరవేరుటయు సంఘములో మంచి పేరు వచ్ఛుటయు ఉద్యోగాస్తులకు ఉద్యోగము లభించుటయు వివాహము కాని వారికి వివాహము జరుగుటయు మొదలగు శుభ ఫలితములు కలుగును . అన్ని వృత్తులవారికి ఆనందదాయకం.
ఈ జాతకులకు 20-11-2020 గురువారము నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు గురుడు 8 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో" చోరగ్ని వృషబీతిచ్చ గాంభీర్యం గాత్ర నాశనం! నిష్థూరం సహసం కార్యం అష్ణమాస్తే భవేద్గురౌ !!

చోరుల వలన అగ్ని వలన భయము పోలీసులపల్ల భయము శరీరము కళాహీనము యగుట అధైర్యము, కఠినముగా మాట్లాడుట కోపముసు ప్రదర్శించుట హద్ధుమీరి నడుచుట రోగ భయము స్థానమార్పు ఉద్యోగులకు బదిలీ సమస్యలు గాని అవినీతి ఆరోపణలుగాని ఎదుర్కుంటారు కుటుంబ చిక్కులు, ఆర్దిక ఇబ్బందులు, అనుకున్న పనులు వాయిదా పడటము జరుగును, ప్రయాణములో చాలా జాగ్రత్త అవసరము. బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.
ఈ జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు శని8 స్థానంలోను ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును .


శ్లో "నానాకార్య విరోదశ్చ వ్యాదిపీఢాధనక్షయం, అపమృత్యు భయప్రాప్తి అప్టమస్తే యదాశనౌ" !!

మనోవిచారము సోదరులతో విరోదము బంధువిరోధము, ధనముగూర్ఛి ఇబ్బందులు పడుటయు ధైర్యము సన్నగిల్లుటయు వ్రతిపనికి భయవడుటయు కోర్టు వ్యవహారాదులు అనుకూలించకుండుటయు అదృష్టమునకు దూరమగుటయు , భార్యతో మనస్పర్ధలు వచ్ఛుటయు శరీరము సహజత్వము కోల్పోవుట కుటుంబ చిక్కులు, ఆర్దిక ఇబ్బందులు, అనుకున్న పనులు వాయిదా పడటము జరుగును, ప్రయాణములో చాలా జాగ్రత్త అవసరము. శనేశ్వరుడు శాంతించుటకు 1 1/4 కిలొ నువ్వులు , 9*5 నీలిరంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.


మృగశిర వారికి లక్కీ నెంబర్లు 1-9-6, లక్కీ స్టోన్‌ పగడం, ఆరిధ్ర వారికి లక్కీ నెంబర్లు 4-5, లక్కీ స్టోన్‌ గోమేధికం ఉంగరం, పునర్వసు వారికి లక్కీ నెంబర్లు 2-5-3, ల క్కీ వారం గురువారం, లక్కీ స్టోన్‌ కనకపుష్పరాగం, మిధున రాశి వారందరికి సోమవారం ఘాతవారం.
మీరు నిత్యం పఠించే మంత్రం ఓం క్లీం కృష్ణాయ నమః అని రోజు 27 సార్లు పఠించాలి
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।
అనిద్దేశ్వవపుః శ్రీమాన్‌ అమేయాత్యా మహాద్రిధృత్‌ ॥ (మృగ 3 పా)
శ్లో॥ మహేష్వాసో మహిభర్తా శ్రీనివాస స్సతాంగతిః ।
అనిరుద్ధ స్సురాసన్దో గోవిన్దో గోవిందాంపతిః ॥ (మృగ 4 పా)
శ్లో॥ మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః॥ (ఆర్ద్ర 1పా)
శ్లో॥ అమృత్యు స్సరదృక్సింహః సన్ధాతా సన్ధిమాన్‌ స్ధిరః ।
అజోదుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ (ఆర్ద్ర 2 పా)
శ్లో॥ గురు ర్గురుతమో ధామః సత్య స్సత్య పరాక్రమః ।
నిమిషో2 నిమిస స్స్రగ్వీ వాచస్పతి రుదారధీ ః ॥ (ఆర్ద్ర 3 పా)
శ్లో॥ అగ్రణీర్గ్రామణీ శ్శ్రీమాన్‌ న్యాయో నేతా సమీరణః।
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్‌ ॥ (ఆర్ద్ర 4 పా)
శ్లో॥ ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్ధనః ।
అహస్సంవర్తకో వహ్ని ః అనిలో ధరణీధర ః ॥ (పునర్వపు 1పా)
శ్లో॥ సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతస్సాధుః జహ్నుర్నారాయణోనరః ॥ (పున 2 పా)
శ్లో॥ అసంఖ్యేయో 2 ప్రమోయాత్మా విశిష్ట శ్శిష్టకృచ్ఛువిః ।
సిద్ధార్థః స్సిద్ధసఙ్క్పః సిద్ధిద స్సిద్ధిసాధనః ॥ (పునర్వసు 3 పా)