+91 9704053369

Contact Us

android

IOS

Libra Yearly Predictions

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర తులారాశి గోచార ఫలము

చిత్త 3,4 పాదము, స్వాతి 1,2,3,4 పాదము, విశాఖ 1,2,3 పాదము. రా, రి, రూ, రే, రో, తా, తి, తు, తే అక్షరాు కసి తులారాశి అగును. ద్వంద్వాక్షర పేర్లు : స్రవంతి, శ్రావన్‌, భ్రమరాంబ, ప్రణిత, శ్రీధర్‌, శ్రీనివాస్‌, శ్రీనిది, బ్రహ్మచారి,బ్రహ్మ ప్రభాకర్‌, ప్రనిత, రైవతుడు, రౌదృడు, ద్రౌపతి, త్రిశంకుడు, దృపదుడు శ్రేష్టుడు, ద్రోణుడు, ద్రోనాచారి
గురువారం ఘాతవారం. ఆధాయం 14, వ్యయం 11, రా.పూజ్యం 7, అవమానం 7


ఈ రాశివారి జాతక లక్షణాలు వేద బ్రాహ్మణులను సాదుసత్పురుషులను, గురువులను పూజించువారు. ప్రతిభావంతులు, కండబలం కన్నా గుండెబలం పెద్దది, దేహ బలం కన్నా బుద్ధి బలం ఎక్కువ, ఇతరుల సహాయ సహకారం లేక స్వయం కృషితో డబ్బు సంపాదించును. ధనవంతులు, గుణవంతులు, వ్యాపారం నందు నైపుణ్యత గలవారును. ఇతనికి ప్రధమ నామధేయంగాక ద్వితీయ నామదేయముతో పిలువబడుతారు. బంధువులకు ఉపకారం చేయువారు. వాస్తు జ్యోతిష్యం, పాండిత్యం గలవారు.
ఈ తులా రాశి జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి 19-11-2020 గురువారము వరకు గురుడు 3 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో. అతిక్లేశం బంధవైర్యం ధారిద్రదేహపీడం . ఉద్యోగ బంగహాకలాహం తృతీయ స్థానకే ద్గురౌ॥

మనోవిచారము సోదరులతో విరోదము బంధువిరోధము, ధనముగూర్చి ఇబ్బందు పడుటయు ధైర్యము సన్నగ్లిుటయు ప్రతిపనికి భయపడుటయు కోర్టు వ్యవహారాదు అనుకూలించకుండుటయు అదృష్టమునకు దూరమగుటయు , భార్యతో మనస్పర్ధులు వచ్చుటయు శరీరము సహజత్వము కోల్పోవుటయు జరుగును. బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.
ఈ జాతకులకు 20-11-2020 గురువారము నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు గురుడు 4 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో. యాచనం బుద్ధిచాంచ్యం తేజోహాని ధనా వ్యయం.దేశత్యాగంశ్చ కలాహం చతుర్ధస్థానకే ద్గురౌ॥

గృహ సంబందమైన సమస్యలు వాహన ప్రమాదము జరుగును. తల్లికి అనారోగ్యము సంభవించుటయు దరిద్రము సంభవించుటయు స్థిరత్వము లేక పోవుటయు అపకీర్తియు ధనవ్యయము కలుగుటయు , స్థానచలనము కలుగుటయు. ఉద్యోగులకు దూర ప్రాంతము బదిలీలు కలుగుటయు విద్యార్థులకు ఆశించిన స్థాయిలో మార్కులు రాకుండుటము ఉన్నత విద్యాభ్యాసమునకు ఆటంకము కలుగుటయు జరుగును . బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.
ఈ జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు శని4 స్థానంలోను ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును .


శ్లో|| వాతశూల మనస్థాపం జ్ఞాతివ్యాసకలహపకం | హీన స్త్రీబోగసంతాపం పంచమస్థానగే శనౌ !!

శుభ కార్యక్రమములు చేయుట వలన ధన వ్యయము పాడి పరిశ్రమ అనుకూలించక పోవుట స్థానచనము ఉద్యోగుకు బదిలీలు తరుచు ప్రయాణము అప్పు చేయుట మలిన వస్త్రధారణ చేయుట మరియు కుటుంబ చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నవి వాయిదాపడుట మనకు రావసిన డబ్బులు రాకపోవుడం ఇచ్చేకాడ సతాయించడం జరుగును . ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవడం అనారోగ్యము కలుగును. శతృభయం, దృష్ఠిదోషం ఉన్నది దుర్గ యంత్రం ప్రతిష్టించుకోండి. శనేశ్వరుడు శాంతించుటకు 1 1/4 కిలొ నువ్వులు , 9*5 నీలిరంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.

అన్ని వృత్తులవారికి ఈ సంవత్సరము మధ్యమ ఫలితము ఉండును. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానము అందుకోనును. నాట్యకళా రంగస్థ మరియు వేదపండితులు ఘణసన్మానము పొందును. విద్యార్ధులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.

చిత్త వారికి లక్కీ నెం.5-6-9, లక్కీ స్టోన్‌ పగడం ధరించాలి. స్వాతి వారికి లక్కీ నెం.4-6, లక్కీ స్టోన్‌ గోమేధికం ధరించాలి. విశాఖ వారికి లక్కీ నెం.3-6-9, లక్కీ స్టోన్‌ కనకపుష్పరాగం ధరించాలి. తులారాశి వారందరికి శుక్రవారం మంచిది. గురువారం ఘాత. మీరు పూజించే భగవంతుడు శ్రీరాముడు. ఓం తత్వనిరంజనాయ తారక రామాయనమ: రోజుకు 27 సార్లు మీరు ప్రతి దినం పఠించాలి

మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ జీవో వినయితా సాక్షీ ముకున్దో2మిత విక్రమః।
అమ్భోనిధి రనన్తాత్మా మహోదధిశయో2 న్తకః ॥ (చిత్త 3 పా)
శ్లో॥ అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనో2 నన్దః సత్యధర్మా త్రివిక్రమః॥ (చిత్త 4 పా)
శ్లో॥ మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షః మహాశృఙ్గః కృతాన్తకృత్‌ ॥ (స్వాతి 1 పా)
శ్లో॥ మహావరాహో గోవిన్దః సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యాగభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః ॥ (స్వాతి 2 పా)
శ్లో॥ వేధాస్స్వాంగో2 జితః కృష్ణో దృఢస్సఙ్కర్షణో2 చ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ (స్వాతి 3 పా)
శ్లో॥ భగవాన్‌ భగహానన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ (స్వాతి 4 పా)
శ్లో॥ సుధన్వా ఖణ్ణపరశుః దారుణో ద్రవిణః ప్రదః ।
దివస్పృక్సర్య దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః ॥ (విశాఖ 1 పా)
శ్లో॥ త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్‌ ।
సన్యాసకృఛమశ్శాన్తో నిష్ఠాశాన్తిః పరాయణః ॥ (విశాఖ 2 పా)
శ్లో॥ శుభాంగశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ (విశాఖ 3 పా)