+91 9704053369

Contact Us

android

IOS

Virgo Yearly Predictions

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర కన్యా రాశి గోచార ఫలము

ఉత్తర : 2,3,4 పాదము, హస్త 1,2,3,4 పాదము, చిత్త 1,2 పాదము టో, పా, పి, పు, ష, ణా, ఠ, పే, పో అక్షరాు కసి కన్యారాశి అగును. ద్వంద్వాక్షర పేర్లు : క్షేమయ్య, క్షీరసాగర్‌, మృఖండుడు, ఫణిశర్మ, పౌడిశ్వర్‌, స్పందన, పౌరోహిత
శని, మంగళవారాలు ఘాతవారాలు. ఆధాయం 2, వ్యయం 11, రా.పూజ్యం 4, అవమానం 7


ఈ రాశి జాతక లక్షణాలు అంధమైన, సుందరమైన రూపలావణ్యము గలవారు. భోగభాగ్యము, సుఖము అనుభవించువారు. మృధువైన శరీరము కలవారు. నీతిపరులు, సత్యవంతులు, పార్కుయందు, ఆటపాట యందు ఇష్టము కలవారు. కామమనే కోరిక ఎక్కువ. ఇతర ప్రదేశముందు నివసించువారు. మంచి ప్రియవచనము పలుకువారు. మిత్రులకు, బంధువులకు మంచి చేయువారు. ధర్మకార్యములు చేయువారు. నృత్య గీతవాయిద్య పుస్తక లేఖనాది పనులయందు ఇష్టము గలవారు. స్వల్ప సంతానము, స్త్రీ పురుషులుందురు.
ఈ కన్యా రాశి జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి 19-11-2020 గురువారము వరకు గురుడు 4 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో. యాచనం బుద్ధిచాంచ్యం తేజోహాని ధనా వ్యయం.దేశత్యాగంశ్చ కలాహం చతుర్ధస్థానకే ద్గురౌ||

గృహ సంబందమైన సమస్యలు వాహన ప్రమాదము జరుగును. తల్లికి అనారోగ్యము సంభవించుటయు దరిద్రము సంభవించుటయు స్థిరత్వము లేక పోవుటయు అపకీర్తియు ధనవ్యయము కలుగుటయు , స్థానచలనము కలుగుటయు. ఉద్యోగులకు దూర ప్రాంతము బదిలీలు కలుగుటయు విద్యార్థులకు ఆశించిన స్థాయిలో మార్కులు రాకుండుటము ఉన్నత విద్యాభ్యాసమునకు ఆటంకము కలుగుటయు జరుగును . బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.
ఈ జాతకులకు 20-11-2020 గురువారము నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు గురుడు 5 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో || అర్ధలాభం తదైశ్వర్యం, కర్మరతిహర్షతమ్ | సదాస్వజన సౌఖ్యంచ, పంచమాస్తే భవేద్గురౌ ||

సంతానాభివృద్ధి కలుగుట, సంతానమునకు శుభకార్యములు జరుపుట, ధనలాభము కలుగుట, మంత్రసిద్ధి కలుగుట, అయాచితముగా సంపద వచ్చుటయు వృత్తి ఉద్యొగ వ్యాపారాదుల యందు అభివృద్ధి యు , పై అధికారుల మన్నలను పొందుట, కుతుంబముతో మహా సంతోషముతొ ఉండుట దేవతా కార్యములు జరిపించుట మొదలగు శుభ ఫలితములు కలుగును .
ఈ జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు శని5 స్థానంలోను ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును .


శ్లో. కార్యహాని మనస్థాపం జ్ఞాతివ్యాసకలా పకం. హీణస్త్రీబోగ సంతాపం. పంచమాస్థే భవేశ్చనౌ||

శుభ కార్యక్రమములు చేయుట వలన ధన వ్యయము పాడి పరిశ్రమ అనుకూలించక పోవుట స్థానచలనము ఉద్యోగులకు బదిలీలు తరుచు ప్రయాణము అప్పు చేయుట మలిన వస్త్రధారణ చేయుట మరియు కుటుంబ చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నవి వాయిదాపడుట మనకు రావలసిన డబ్బు రాకపోవుడ ఇచ్చేకాడ సతాయించడం జరుగును . ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవడం అనారోగ్యము కలుగును. శతృభయం, దృష్ఠిదోషం ఉన్నది దుర్గ యంత్రం ప్రతిష్టించుకోండి. శనేశ్వరుడు శాంతించుటకు 1 1/4 కిలొ నువ్వులు , 9*5 నీలిరంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.

అన్ని వృత్తల వారికి ఈ సంవత్సరము మధ్యమ ఫలితము ఉండును. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానములు అందుకోనును. నాట్యకళా రంగస్థల మరియు వేదపండితలు ఘణసన్మానము పొందును. విద్యార్ధులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.

ఉత్తర నక్షత్రం 2వ పాదం వారికి లక్కీ నెం.5-1, లక్కీ స్టోన్‌ కెంపు ధరించాలి. లక్కీ వారం ఆదివారం. లక్కీ దిశ తూర్పు. హస్త నక్షత్రం వారికి లక్కీ నెం.2-5, లక్కీవారం సోమవారం, లక్కీ స్టోన్‌ ముత్యం, చిత్త నక్షత్రం వారికి పగడం ఉంగరం, లక్కీ నె.5-6-9, ఈ కన్యారాశి వారికి శని, మంగళ ఘాతవారం. మీరు నిత్యం పఠించే మంత్రం ఓం ప్రీం పీతాంబ్రాయ నమః రోజుకు 27 సార్లు పఠించాలి.
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్‌ ।
అర్ధో2 నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ (ఉత్తర 2 పా)
శ్లో॥ అనిర్విణ్ణిః స్థవిష్ఠో2 భూః ధర్మయూపో మహామఖః ।
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః॥ (ఉత్తర 3పా)
శ్లో॥ యజ్ఞఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతిః ।
సర్వదర్శీ నివృత్తాత్మాసర్వజ్ఞో జ్ఞానముత్తమమ్‌ ॥ (ఉత్తర 4 పా)
శ్లో॥ సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్‌ ।
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ (హస్త 1 పా)
శ్లో॥ స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్‌ ।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోధనేశ్వరః॥ (హస్త 2 పా)
శ్లో॥ ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్‌క్షర మక్షరం ।
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతక్షణః॥ (హస్త 3 పా)
శ్లో॥ గభస్తినేమిస్సత్త్వసః సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు ః ॥ (హస్త 4 పా)
శ్లో॥ ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్మః పురాతన ః।
శరీరభూతభృద్భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ (చిత్త 1 పా)
శ్లో॥ సోమపో2 మృతపస్సోమః పురుజిత్పురు సత్తమః ।
వినయోజయస్సత్యసన్ధో దాశార్హ స్సాత్వతాంపతి ః ॥ (చిత్త 2 పా)