+91 9704053369

Contact Us

android

IOS

Capricorn Yearly Predictions

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర మకర రాశి గోచార ఫలము

ఉత్తరాషాఢ 2,3,4 పాదము, శ్రవణం 1,2,3,4 పాదము, ధనిష్ఠ 1,2 పాదము. భో, జా, జీ, జు, జే, జో, ఖ, గా, గీ అను అక్షరాలు కలిపి మకరరాశి అగును. ద్వంద్వాక్షర పేర్లు : గౌరిదేవి, గైరికము, గౌతముడు, గౌరీశ్వర్‌, గౌరిశంకర్‌, గౌరీశ్వరి
మంగళవారం ఘాతవారం.ఆధాయం 11, వ్యయం 6, రా.పూజ్యం 2, అవమానం 6


ఈ రాశివారి జాతక లక్షణాలు భార్య పుత్రులను ప్రేమించువారు. దాన ధర్మము చేయువారు. ధర్మ కార్యములు చేయును. ధనము సంపాదించి వృదాగా ఖర్చు చేయువారు. కృషించిన తొడు గలవారు. మంచి విశామైన కన్ను కలవారు. చెప్పినంత మాత్రముననే గ్రహించు స్వభావము గలవారు. మహాతెలివి తేటులు కలవారు. వేద బ్రాహ్మణ భక్తి గలవారు. హీన జాతి స్త్రీను గౌరవించువారు. దయాదాక్షిణ్యం గలవారు. కార్యశీలుడు కర్మనిరతుడు. పుత్రసంతానము గలవారు. ఏకసంత గ్రహిణి పెద్దలను గౌరవించును. తల్లిదండ్రును, గురువును పూజించువారు. పెద్ద పెద్ద వారిచే ఘనసన్మానం పొందువారు. మితముగా, హితముగా మాట్లాడుదురు.
ఈ మకర రాశి జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి 19-11-2020 గురువారము వరకు గురుడు 12 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో. శుభమూలే వ్యామోహం ఛైవ ప్రాణవిక్రయ ధూషణం. స్థానభ్రష్టంచ దారిద్య్రయం ద్వాదశ స్థానే గురౌ॥

శుభ కార్యక్రమములు చేయుట వలన ధన వ్యయము పాడి పరిశ్రమ అనుకూలించక పోవుట స్థానచలనము ఉద్యోగులకు బదిలీలు తరుచు ప్రయాణము అప్పు చేయుట మలిన వస్త్రధారణ చేయుట మరియు కుటుంబ చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నవి వాయిదాపడుట మనకు రావలసిన డబ్బు రాకపోవడం , ఇచ్చేకాడ సతాయించడం జరుగును. ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవడం అనారోగ్యము, మీతో సహాయ సహాకారము పొందిన వారు మీకు శత్రువులు అగుదురు. బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.
ఈ జాతకులకు 20-11-2020 గురువారము నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు గురుడు 1 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో. రాజకోపం యశోహాణి ఉద్యోగం విరోధకం. రోగార్థి బంధువైర్యంచ్చ వ్యసనం జన్మకే గురౌ॥

జన్మ యందు గురువు సంవత్సరంతము యుండుట చేత పోలీసు వారి వలన భయము ధననష్టము , గౌరవ హాని కలుగుటయు బుద్ధి చాంచల్యము అనుకోని సంఘటనలు, ధననష్టము జరుగుటయు, ఆపదలు కలుగుటయు చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారాదు అనుకూలించక పోవుటయు మరియు కనుదిష్టి దృష్టిప్రయోగం వలన ఇబ్బందులు జరుగును . బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు. ఈ జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు శని1 స్థానంలోను ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును .

శ్లో. తేజోహాని మతీబ్రంశ ఘణపీడ భయం తధాః. రోగార్ధి బంధువైరంచ వ్యసనం జన్మకే శనౌ॥

అపకీర్తి భార్యాపుత్రులతో విరోదము చంచల బుద్ధియు మనస్థాపము భయము కలుగుట శరీరము యందు వాతాధిక్యత బంధు మిత్రవిరోదము సేవకావృత్తి వలన జీవనము చేయువృత్తి ఉద్యోగ వ్యాపారము ఆశించిన స్థాయిలో యుండకుండుట తలపెట్టిన పనులు ఆటంకము ఏర్పడుట విద్యార్థులకు విద్యాభంగము కలుగుటయు మొదలగు చెడుఫలితాలు కలుగును. శనేశ్వరుడు శాంతించుటకు 1 1/4 కిలొ నువ్వులు , 9*5 నీలిరంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.

శ్లో॥ తేజోహాని మతీబ్రంశ ఘణపీడ భయం తధాః। రోగార్ధి బంధువైరంచ వ్యసనం జన్మకే శనౌ॥

అపకీర్తి భార్యాపుత్రులతో విరోదము చంచల బుద్ధియు మనస్థాపము భయము కలుగుట శరీరము యందు వాతాధిక్యత బంధు మిత్రవిరోదము సేవకావృత్తి వలన జీవనము చేయువృత్తి ఉద్యోగ వ్యాపారము ఆశించిన స్థాయిలో యుండకుండుట తలపెట్టిన పనులు ఆటంకము ఏర్పడుట విద్యార్థులకు విద్యాభంగము కలుగుటయు మొదలగు చెడుఫలితాలు కలుగును,
శనికి 1 1/4 కిలో నువ్వులు , 2 1/2 మేటర్ల నల్ల వస్త్రము శనివారం పూరోహితునికి దానం ఇవ్వండి
అన్ని వృత్తులవారికి ఈ సంవత్సరము మధ్యమ ఫలితము ఉండును. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానము అందుకోనును. నాట్యకళా రంగస్థల మరియు వేదపండితులు ఘణసన్మానము పొందును. విద్యార్ధులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.


ఉత్తరాషాఢ వారికి లక్కీ నెంబర్లు 1-3-8-9, లక్కీ స్టోన్‌ కెంపు ఉంగరం ధరించాలి. శ్రవణం వారికి లక్కీ నెం.2-8, లక్కీ స్టోన్‌ ముత్యం ఉంగరం ధరించాలి. ధనిష్ఠ వారికి లక్కీ నెంబర్లు 9-8, లక్కీ స్టోన్‌ పగడం ఉంగరం ధరించాలి. లక్కీ వారము ఆది, సోమ, బుధవారము మంచివి. శని, మంగళవారాలు ఘాత. మీరు నిత్యం పూజించే భగవంతుడు శ్రీమన్నారాయణ.
ఓం శ్రీం వత్సరాయనమ: రోజుకు 108 సార్లు పఠించండి.
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ చతుర్మూర్తి శ్చతుర్భాహుః చతుర్వూ ్యహః చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావః చతుర్వేదవిదేకపాత్‌ ॥ (ఉత్తరాషాఢ 2 పా)
శ్లో॥ సమావర్తో2 నివృత్తాత్మా దుర్జమో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసోదురారిహా ॥ (ఉత్తరాషాఢ 3 పా)
శ్లో॥ శుభాంగో లోకసారంగః సుతస్తు స్తన్తువర్ధన ః ।
ఇన్ధ్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ (ఉత్తరాషాఢ 4 పా)
శ్లో॥ ఉద్భవ స్సుందర స్సున్దో రత్ననాభ స్సులోచనః ।
అర్కో వాజసని శృంగీ జయన్తః సర్వవిజ్ఞయీ ॥ (శ్రవణ 1 పా)
శ్లో॥ సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ (శ్రవణ 2 పా)
శ్లో॥ కుముదః కున్దరః కుందః పర్జన్యః పావనో2 నిః ।
అమృతాశో2 మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥ (శ్రవణ 3 పా)
శ్లో॥ సుభ స్సువ్రత స్సిద్ధః శత్రుజి చ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరో2 శ్వత్థః చాణూరాన్ద్ర నిషూదనః ॥ (శ్రవణ 4 పా)
శ్లో॥ సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైథా స్సప్తవాహన ః ।
అమూర్తి రనగో2 చిన్త్యోభయకృద్భయనాశనః ॥ (ధనిష్టా 1 పా)
శ్లో॥ అణు ర్బృహ త్క ృశః స్థూలో గుణభృన్నిర్గుణోమహాన్‌ ।
అధృత స్స్వధృత స్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ (ధనిష్టా 2 పా)