+91 9704053369

Contact Us

android

IOS

Pisces Yearly Predictions

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర మీన రాశి గోచార ఫలము

పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1`2`3`4 పాదము, రేవతి 1`2`3`4 పాదము.ది, దు, శం, రaా, ధా, దే, దో, చా, చీ అక్షరాు కలిపి మీనరాశి అగును. ద్వంద్వాక్షర పేర్లు : స్థానికుడు, శోభ, శోభన్‌, శైజ, శృతి, కీర్తి, శివుడు,
శుక్రవారం ఘాతవారం. ఆధాయం 8, వ్యయం 11, రా.పూజ్యం 1, అవమానం 2


ఈ రాశివారి జాతక లక్షణాలు మధుర పదార్థముయందు ఇష్టము గలవారు. శాఖాహారం భుజించువారు. పాలు, పెరుగు, నెయ్యి, ఇష్టం గలవారు. సొగసైన ముఖవర్చస్సు గలవారు. స్థూలమైన సుందరమైన దేహం గలవారు. శత్రువులను జయించువారు. అందమైన, సుందరమైన నేత్రము కలవారు. సొంత ధనార్జితము కలవారు. మంచి ఆచార నిష్టకలవారు. వేదశాస్త్రము, ఉపనిషత్తులు, తత్వశాస్త్రము నెరిగినవారు. ఇలాంటి లక్షణము గలవారైయుందురు.
ఈ మీన రాశి జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి 19-11-2020 గురువారము వరకు గురుడు 10 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో. ధాన్యనాశో ధనచ్ఛేదః హృదాసంచరణ భయం. స్వజనై ర్ధూశనం చ్చైవ దశమాస్తే యదౌ గురౌ.॥

ధనధాన్య నష్టము అనవసర వాహణ ప్రయాణములో ప్రమాధము కలుగును, మనస్సున భయము కలుగుట బంధు జనులను ధూషించుట కలహము వచ్చుట శరీరమున వాతరోగము ప్రవేశించుట , కుటుంబ చిక్కులు, ఆర్ధిక ఇబ్బందులు, అనుకున్న పనులు వాయిదా పడటము జరుగును, ప్రయాణములో చాలా జాగ్రత్త అవసరము. ఉద్యోగులకు బదిలీలు కలుగుట, సంతానముతో విరోదము ప్రభుల సన్మానము రాక పోవుట, రాచకార్యవిరోదము, ఉద్యోగస్థులకు ఉద్యోగము లభించక పోవుట మొదలగు చెడుఫలితాలు కలుగును. మీఇంట్లో లక్ష్మీకుబేరయంత్రం ప్రతిష్ఠించుకోండి. బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు. ఈ జాతకులకు 20-11-2020 గురువారము నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు గురుడు 11 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.

శ్లో. యశోవృద్ధి బలంతేజః సర్వత్ర విజయం స్సుఖం. శేతృహం తిరుమంత్రం సిద్ధిః ఏకాదశ స్థాకే గురౌ

గృహలాభము, కులాచారము యందు శ్రద్ధ ధనలాభము అయాచితముగా ధనము లభించుట పరస్త్రీ సౌఖ్యము మంచి భోజనము సంతోషముగా జీవించుట బుద్ధి బలము సొంతగ్రామము యందు సౌఖ్య జీవనము మనస్సున తలచిన పనులు నెరవేరుట ఆరోగ్యము పశు ధాన్యలాభము తండ్రికి ఆరోగ్యము కలుగుట పిత్రార్జిత ఆస్థి కలసి వచ్చుటయు జరుగును .
ఈ జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు శని11 స్థానంలోను ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును .


శ్లో. ఆరోగ్యం అర్ధలాభశ్ఛ స్త్రీపుత్ర సుఖవర్ధనం. చిత్తశుద్ధిభీష్టార్ధం ఏకాదశ స్థానగే శనౌ॥

ధనలాభము, చేయు వృత్తి వ్యాపారము యందు అభివృద్ధి, ప్లాటు కొనడము, భూమి కొనడము, గృహనిర్మాణము, ఇంట్లో శుభకార్యములు చేయడం జరుగును. భూలాభము ఏపనిచేసిననూ ధనలాభము కుటుంబ సౌఖ్యము ఆరోగ్యవృద్ధి సంతానప్రాప్తి సంతోషము ప్రయత్నించిన పనులు నెరవేరుటయు తన మాట ఇతరులు వినుటయు జరుగును .
విద్యార్థులు మంచి మార్కులో ఉత్తీర్ణులు యగుదురు పెద్దల మన్ననను పొందుదురు. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. వ్యవసాయదారులకు వ్యవసాయం అనుకూలిస్తుంది. మీగృహంలో శ్రీ లక్ష్మీకుబేర , సుదర్శనయంత్రం ప్రతిష్ఠించుకొనండి, ధనలాభము కలుగును.


పూర్వాభాద్ర వారికి లక్కీ నెంబర్లు 8-3, లక్కీ స్టోన్‌ పుష్పరాగం ఉంగరం, ఉత్తరాభాద్ర వారికి లక్కీ నెంబర్లు 3-8, లక్కీ స్టోన్‌ ఇంద్రనీలం ఉంగరం, రేవతి వారికి లక్కీ నెంబర్లు 4-5, లక్కీ స్టోన్‌ జాతి పచ్చ ఉంగరం, లక్కీ వారము బుధవారం, గురువారం, శనివారం మంచివి. శుక్రవారం ఘాత. మీరు పూజించే భగవంతుని నామం విష్వక్సేన. ఓం క్లీం ఉదృతాయ ఉద్దారినేనమ: రోజుకు 108 సార్లు పఠించాలి.

మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ అనన్త రూపో2 నన్త శ్రీః జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ (పూర్వాభాద్ర 4 పా)
శ్లో॥ అనాది ర్భూర్భువో క్ష్మీః సువీరో రుచిరాంగదః ।
జనవో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః ॥ (ఉత్తరాభాద్ర 1 పా)
శ్లో॥ ఆధార నియో2 ధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదఃప్రణవఃపణః ॥ (ఉత్తరాభాద్ర 2 పా)
శ్లో॥ ప్రమాణం ప్రాణ నియః ప్రాణభృత్‌ ప్రాణ జీవనః ।
తత్త్వం తత్త్వ విదేకాత్మాజన్మమృత్యుజరాతిగః ॥ (ఉత్తరాభాద్ర 3 పా)
శ్లో॥ భూర్భువ స్స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగోయజ్ఞవాహనః ॥ (ఉత్తరాభాద్ర 4 పా)
శ్లో॥ యజ్ఞభృత్‌ యజ్ఞకృత్‌ యజ్ఞీ యజ్ఞభుక్‌ యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృత్‌ యజ్ఞ గుహ్యం అన్నమన్నాద ఏవచ॥ (రేవతి 1 పా)
శ్లో॥ ఆత్మయోని స్స్వయంజాతో వైఖాన స్సామగాయనః ।
దేవకీ నన్దన స్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ (రేవతి 2 పా)
శ్లో॥ శఙ్ఖభృత్‌ నన్దకీ చక్రీ శార్‌ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణి రక్షోభ్యః సర్వ ప్రహరణాయుధః॥ (రేవతి 3 పా)
శ్లో॥ శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి
వనమాలీ గదీ శార్‌ఙ్గీ శంఖీ చక్రీ చ నన్దకీ ।
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో2 భిరక్షతు ॥ (రేవతి 4 పా) 108