+91 9704053369

Contact Us

android

IOS

Scorpio Yearly Predictions

శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర వృశ్చిక రాశి గోచార ఫలము

విశాఖ 4వ పాదం, అనూరాధ 1,2,3,4 పాదము, జ్యేష్ఠ 1,2,3,4 పాదము తో, నా, నీ, నూ. నే, నో, యా, యీ, యు అక్షరాు కలిసి వృశ్చిక రాశి అగును. ద్వంద్వాక్షర పేర్లు : స్నుష, స్నేహితుడు, స్నేహ, వ్యాసుడు, వ్యాప్తి.
శుక్రవారం ఘాతవారం. ఆధాయం 5, వ్యయం 5, రా.పూజ్యం 3, అవమానం 3


ఈ రాశివారి జాతక లక్షణాలు వేద బ్రాహ్మణులను సాదుసత్పురుషులను, ఈ రాశివారి జాతక లక్షణాలు విశాలమగు వక్షస్థల గలవారు. స్థూలమైన తొడు గలవారు. బలమైన మోకాళ్ళుగలవారు. తల్లిదండ్రును, గురువును విడిచిపెట్టని వారు. బ్యామందు అనారోగ్యపరుడు. రాజకీయ నాయకులకు పరిచయం గలవారు. కోపము అధికము వారు. చేసిన మేలు మరచిపోవుదురు. రహస్య స్థానంలో పుట్టుమచ్చ, మత్స్యరేఖ కలవారు. నమ్మిన వారిని మోసగించే స్వభావం ఉండును. పేరు ప్రఖ్యాతులు బాగుండును. మంచి వారు అనిపించుకొనును.
ఈ వృశ్చిక రాశి జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి 19-11-2020 గురువారము వరకు గురుడు 2 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో.మనస్సౌక్యైం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమః. ధర్మవ్యయం మనసౌఖ్య ద్వితీయస్థానకే గురౌ॥

నేత్ర సంబంధమైన బాధతొలుగును. మనస్సున ఆనందము, ఇతరు వద్ద పలుకుబడి పెరుగుట ధనలాభము కలుగుట మనస్సున తలచిన పనులు నెరవేరుట ధర్మ కార్యములు చేయుట మొదలగు శుభఫలితము కలుగును . అనుకున్నవి సాధించుట ఇంట్లో శుభకార్యాలు చేయుట ఇతరుల శుభాకార్యాలు జరిపించుట. భూమికొనడం లేక అమ్మడం గృహనిర్మాణం చేస్తారు.
ఈ జాతకులకు 20-11-2020 గురువారము నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు గురుడు 3 స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.


శ్లో. అతిక్లేశం బంధవైర్యం ధారిద్రదేహపీడం . ఉద్యోగ బంగహాకలాహం తృతీయ స్థానకే ద్గురౌ॥

మనోవిచారము సోదరులతో విరోదము బంధువిరోధము, ధనముగూర్చి ఇబ్బందు పడుటయు ధైర్యము సన్నగ్లిుటయు ప్రతిపనికి భయపడుటయు కోర్టు వ్యవహారాదు అనుకూలించకుండుటయు అదృష్టమునకు దూరమగుటయు , భార్యతో మనస్పర్ధులు వచ్చుటయు శరీరము సహజత్వము కోల్పోవుటయు జరుగును. బృహస్పతి శాంతించుటకు 1 1/4 కిలొ శనిగలు , 9*5 పసుపు రంగు ధోతి పురోహితునికి దానము ఇవ్వగలరు.
ఈ జాతకులకు 25-03-2020 బుధవారము ఉగాది నుండి ప్లవనామ సం.ర ఉగాది వరకు శని3 స్థానంలోను ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును .


శ్లో. స్త్రీభోగంచ మనసౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్. స్వస్థానాం ప్రాప్తిమారోగ్యం రవిపుత్ర తృతియస్థానే శనౌ॥

సోదరులతో మంచి సంబందము నెలకొంటాయి. స్త్రీ సౌఖ్యము మనస్సున తలచిన పనులు నెరవేరుటయు మనస్సున సంతోషము కలుగుటయు బుద్ధి బలమును పెంచుకొనుటయు పనులయందు జయము స్వగ్రామము యందు సౌఖ్యజీవనము అనుకున్న పనులు నెరవేరుటయు మనోల్లాసముగాయుండుటయు రావలసిన ధనం చేతికందుతుంది . లక్ష్మినారాయణ యంత్రం, శ్రీసుదర్శనయంత్రం ప్రతిష్ఠించుకొండి.

అన్ని వృత్తువారికి ఈ సంవత్సరము మధ్యమ ఫలితము ఉండును. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానములు అందుకోనును. నాట్యకళా రంగస్థల మరియు వేదపండితులు ఘణసన్మానము పొందును. విద్యార్ధులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.

విశాఖ వారికి లక్కీ నెం.3-6-9, లక్కీ స్టోన్‌ కనకపుష్పరాగం, అనూరాధ వారికి లక్కీ నెంబర్లు 8-9, లక్కీ స్టోన్‌ నీలం, జ్యేష్ఠ వారికి లక్కీ నెంబర్లు 5-9, లక్కీ స్టోన్‌ జాతి పచ్చ, ఈ రాశి వారందరికీ శనివారం మంచిది. శుక్రవారం ఘాత. మీరు పూజించే భగవంతుని నామం ఓం నారాయణాయ నరసింహాయ నమ: 108 సార్లు ప్రతి రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించుట వలన అన్ని విధాల శుభం.
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః ॥ (విశాఖ 4 పా)
శ్లో॥ శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిశ్శ్రీవిభావనః।
శ్రీధరశ్శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్‌లోకత్రయాశ్రయః ॥ (అనూ 1 పా)
శ్లో॥ స్వక్ష స్స్వఙ్గ శ్శతానన్దో నన్దిర్జ్యోతి ర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయ ః ॥ (అనూ 2 పా)
శ్లో॥ ఉదీర్ణస్సర్వతశ్ఛక్షుః అనీశ శ్శాశ్వతః స్ధిరః ।
భూశయో భూషణో భూతిఃవిశోకశ్శోకనాశనః ॥ (అనూ 3 పా)
శ్లో॥ అర్చిష్మా నర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధో2 ప్రతిరధఃప్రద్యుమ్నో2 మితవిక్రమః ॥ (అనూ 4 పా)
శ్లో॥ కానేమినిహా శూరః శౌరిః శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ (జ్యేష్ఠ 1 పా)
శ్లో॥ కామదేవః కామపాః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరో2 నంతో ధనఞ్జయః ॥ (జ్యేష్ఠ 2 పా)
శ్లో॥ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్‌ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీబ్రహ్మజ్ఞో బ్రహ్మణప్రియః ॥ (జ్యేష్ఠ 3 పా)
శ్లో॥ మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతు ర్మహయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ (జ్యేష్ఠ 4 పా)