Do you wanna know more about your career, Horoscope, Health predictions.
Contact Us!శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర ధనుస్సు రాశి గోచార ఫలము
మూల 1,2,3,4 పాదము, పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము.
యే, యో, బా, బీ, బు, ధా, భా, ఢ, బే అక్షరాలు కలిపి ధనస్సు రాశి అగును.
ద్వంద్వాక్షర పేర్లు : శ్యామల, శ్యాంసుందర్, చ్యవనావతి, చ్చవన్, చ్యుతి, జ్యోతి, భీముడు,
భైరవుడు, భోగిశ్వర్, ధూర్జటి, ధ్వజేందర్, ధ్యానుడు, ధృతరాష్ట్రుడు, ధృపదుడు.
శుక్రవారం ఘాతవారం. ఆధాయం 02, వ్యయం 08, రా.పూజ్యం 06, అవమానం 01
ఈ రాశివారి జాతక లక్షణాలు ప్రసన్నమైన ముఖము కలవారు. దివ్యమైన తేజస్సు కలవారు. తాతగారి, తండ్రిగారి ధనము గలవారు. ఆధ్యాత్మిక దైవచింతన కలవారు. ధనవంతుడు, గుణవంతుడు, బుద్ధివంతుడు, త్యాగబుద్ధికవాడు. ఆటపాటలందు, మాటలలో నేర్పరికలవారు. మంచి సద్గ్రందపఠనా శక్తి గలవారు. సుగంధ ద్రైవములందు ఇష్టము కలవారు. ధర్మమార్గమందు నడుచుకొనువారు. బలత్కారమున స్వాదీనపడువారు. మంచిపేరు ప్రఖ్యాతులు పొందుతారు. అందరికీ ఇష్టమైన వారు పెద్దపెద్ద విద్వాంసుతో, వేదపండితులతో పరిచయం కలవారు. చిత్రలేఖ, శిల్పి, హస్త కళాకారుడు అగును.
ఈ 06-04-2019 శనివారం నుండి 05-11-2019 మంగళవారం వరకు గురుడు 4వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.
శ్లో॥ శుభమూలే వ్యామోహం ఛైవ ప్రాణవిక్రయ ధూషణం। స్థానభ్రష్టంచ దారిద్య్రయం ద్వాదశ స్థానే గురౌ ॥
శుభ కార్యక్రమములు చేయుట వలన ధన వ్యయము పాడి పరిశ్రమ అనుకూలించక పోవుట స్థానచలనము ఉద్యోగులకు బదిలీలు తరుచు ప్రయాణము అప్పు చేయుట మలిన వస్త్రధారణ చేయుట మరియు కుటుంబ చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నవి వాయిదాపడుట మనకు రావలసిన డబ్బు రాకపోవడం, ఇచ్చేకాడ సతాయించడం జరుగును. ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవడం అనారోగ్యము, మీతో సహాయ సహాకారము పొందిన వారు మీకు శత్రువులు అగుదురు.
06-04-2019 శనివారం నుండి 25-01-2020 శనివారం వరకు శని 1వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు
శ్లో॥ తేజోహాని మతీబ్రంశ ఘణపీడ భయం తధాః। రోగార్ధి బంధువైరంచ వ్యసనం జన్మకే శనౌ॥
అపకీర్తి భార్యాపుత్రులతో విరోదము చంచల బుద్ధియు మనస్థాపము భయము కలుగుట శరీరము యందు వాతాధిక్యత బంధు మిత్రవిరోదము సేవకావృత్తి వలన జీవనము చేయువృత్తి ఉద్యోగ వ్యాపారము ఆశించిన స్థాయిలో యుండకుండుట తలపెట్టిన పనులు ఆటంకము ఏర్పడుట విద్యార్థులకు విద్యాభంగము కలుగుటయు మొదలగు చెడుఫలితాలు కలుగును
05-11-2019 మంగళవారం నుండి 25-03-2020 బుధవారం వరకు గురుడు 1వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు
శ్లో॥ రాజకోపం యశోహాణి ఉద్యోగం విరోధకం।రోగార్థి బంధువైర్యంచ్చ వ్యసనం జన్మకే గురౌ ॥
జన్మ యందు గురువు సంవత్సరంతము యుండుట చేత పోలీసు వారి వలన భయము ధననష్టము, గౌరవ హాని కలుగుటయు బుద్ధి చాంచ్యము అనుకోని సంఘటనలు, ధననష్టము జరుగుటయు, ఆపదలు కలుగుటయు చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు అనుకూలించక పోవుటయు మరియు కనుదిష్టి దృష్టిప్రయోగం వలన ఇబ్బందులు జరుగును. గురుగ్రహ శాంతించుటకు 1-1/4కిలో శనిగలు గురువారం పురోహితునికి దానం ఇచ్చుట వలన గురుగ్రహ శాంతించును.
25-01-2020 నుండి శని 4వ స్థానంలో సంవత్సరమంతా ఉండుట వలన కలిగే ఫలితాలు
శ్లో॥ సదాక్లేశం వృదావైరం సతతం కార్యనాశనం। సంచారం స్వజనం ధ్వేషం పాపచింతన ధనే శనౌ ॥
ఎల్లప్పుడు విచారము అనవసరముగా కలహము కలుగుట చోరులు చేత అగ్ని చేత భయము ముఖము యందు కళ తగ్గిపోవుట అదైర్యము ఇతరులతో కఠినముగా మాట్లాడుట అమితమైన కోపము కలుగుట నేత్ర సంబంద సమస్యలు కలుగుట కుటుంబ సభ్యుతో వైరము కలుగుట, గౌరవ భంగము కలుగుట ప్రయత్నించిన పనులు ఆగిపోవుట బంధు మిత్రవిరోధము మొదలగు చెడుఫలితములు కలుగును.
అన్ని వృత్తులవారికి ఈ సంవత్సరము మధ్యమ ఫలితము ఉండును. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానము అందుకోనును. నాట్యకళా రంగస్థల మరియు వేదపండితులు ఘణసన్మానము పొందును. విద్యార్ధులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ స్తవ్యస్త్సవప్రియ స్త్సోత్రం స్తుతి స్త్పోతా రణప్రియః। పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః ॥ (మూ 1 పా)
శ్లో॥ మనోజవ స్తీర్ధకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ (మూ 2 పా)
శ్లో॥ సద్గతి స్సత్కృతిస్సత్తా సద్భూతి స్సత్పరాయణః (మ్) ।
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామున ః ॥ (మూ 3 పా)
శ్లో॥ భూతవాసో వాసుదేవః సర్వాసునియో2 నః ।
దర్పహా దర్బదో దృప్తో దుర్ధరో2 థాపరాజితః ॥ (మూ 4 పా)
శ్లో॥ విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాపనః ॥ (పూర్వాషాఢ 1 పా)
శ్లో॥ ఏకోనైన స్సవః కః కిం యత్తత్పద మనుత్తమమ్ ।
లోకబన్ధు ర్లోకనాథో మాధవో భక్తవత్సః ॥ (పూర్వాషాఢ 2 పా)
శ్లో॥ సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ ।
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచశ్చః ॥ (పూర్వాషాఢ 3 పా)
శ్లో॥ అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యః సత్యవేధా ధరాధర ః॥ (పూర్వాషాఢ 4 పా)
శ్లో॥ తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగోగదాగ్రజః ॥ (ఉత్తరాషాఢ 1 పా)



