శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం

Aries zodiac sign

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మేష రాశి గోచార ఫలము

అశ్వని 1,2,3,4, భరణి 1,2,3,4, కృత్తిక 1వ పాదం ,చూ, చే, చో, , లి, లు . లే. లో, ఆ అక్షరాలకు మేష రాశి అగును, ఆదివారం ఘాతవారం.ఆధాయం 14, వ్యయం 14, రా.పూజ్యం 03, అవమానం 06 ద్వంద్వాక్షర పేర్లు : హ్లదుడు, ప్రహ్లాదుడు, ప్రహ్లద, హ్లదిని, క్గేష, లౌకిక


ఈ జాతకులు పుత్రులను భయపెట్టువారు. అందరికీ మంచి చేయువారు. గొప్పగా పేరున్న వ్యక్తులతో పరిచయం గలవారు. చోరప్రసంగము యందు భయపడువారు. మనస్సు చపలచిత్తం. ఎర్రని వర్తులాకారం నేత్రము కలవారు. శ్రీఘ్రకోపం కలవారు.ఒక్కోక్కసారి జాలిగుండె గలవారు. స్థిరంగా నిలువని సంపద కలవారు. పనుల యందు నేర్పరి అగును. 06-04-2019 శనివారము ఉగాది నుండి 05-11-2019 మంగళవారము వరకు గురుడు 8వ స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును

శ్లో" చోరగ్ని వృషబీతిచ్చ గాంభీర్యం గాత్ర నాశనం! నిష్థూరం సహసం కార్యం అష్ణమాస్తే భవేద్గురౌ !!

చోరుల వలన అగ్ని వలన భయము పోలీసులపల్ల భయము శరీరము కళాహీనము యగుట అధైర్యము, కఠినముగా మాట్లాడుట కోపముసు ప్రదర్శించుట హద్ధుమీరి నడుచుట రోగ భయము స్థానమార్పు ఉద్యోగులకు బదిలీ సమస్యలు గాని అవినీతి ఆరోపణలుగాని ఎదుర్కుంటారు కుటుంబ చిక్కులు, ఆర్దిక ఇబ్బందులు, అనుకున్న పనులు వాయిదా పడటము జరుగును, ప్రయాణములో చాలా జాగ్రత్త అవసరము.
శని సంవత్సరమంతా 9వ స్థానంలో ఉన్నందున

శ్లో" శోకరోఘం మహాదుఃఖం ఖక్వచిద్ర్ధవ్యం ! క్వచిత్సుఖం దారాసుతాదిక్షేశంచ నవమశ్థే యదాశనౌ"!

శని ప్రభావము కొంత తగ్గుసు. రాజకీయ వ్యవహారములలో జయము, ఆరోగ్యము కలుగుటయు తేజము, ధనధాన్య లాభము తలచిన పనులు నెరవేరుటయు సంఘములో మంచిపేరు వచ్చుటయు ఉద్యోగస్థులకు ఉద్యోగం లభిచుటయు జరుగును.
శని గ్రహము శాంతించుటకు 1 1/4 కీలోల నువ్వులు, 1 1/4 శనిగలు, 2 1/2 మీటర్ల నల్లవస్త్రము, 2 1/2 మీటర్ల పసుపు వస్త్రము శనివారం రోజున పౌరోహితునికి దానం ఛేయగలరు.
15-11-2019 మంగళవారము నుండి 25-03-2020 బుధవారము వరకు గురుడు 9వ -స్థానంలోను

శ్లో॥ అర్ధంచస్వకులాచారం గృహలాభం సుభోజనం। నిత్య స్త్రీ జన సంపర్కం నవమాస్థే భవేద్గురౌ ॥

గృహలాభము, కులాచారము యందు శ్రద్ధ ధనలాభము అయాచితముగా ధనము లభించుట పరస్త్రీ సౌఖ్యము మంచి భోజనము సంతోషముగా జీవించుట బుద్ధి బలము సొంతగ్రామము యందు సౌఖ్య జీవనము మనస్సున తలచిన పనులు నెరవేరుట ఆరోగ్యము పశు ధాన్యలాభము తండ్రికి ఆరోగ్యము కలుగుట పిత్రార్జిత ఆస్థి కలసి వచ్చుటయు జరుగును. మీకు నరదిష్ఠి ఉన్నది నరఘోషయంత్రము ఇంట్లో ప్రతిష్ఠించుకొండి.
25-01-2020 నుండి శని సంవత్సరమంతా 10 వ స్థానంలో అశుభుడగుట వలన

శ్లో॥ వ్యాకులం శోక సంతాపం పాపముద్యోగ విఘ్నకం। కృష్యాదిసర్వ విఘ్నంచ దశమస్తే భవేశ్చనౌ।

మనస్సున తెలియని ఆందోళన అనేక రూపములో కష్టము సంభవించుటయు పాప కార్యము చేయుటయు చేయువృత్తి ఉద్యోగవ్యాపారాల యందు చిక్కులు అవినీతిశాఖవారి వలన ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు ఉద్యోగభంగము కలుగుట అనవసరమైన ధనవ్యయము, విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత యుండకుండుటయు భార్యా భర్తల మధ్య మనస్పదర్థులు వచ్చుటయు జరుగును.
అన్ని వృత్తులవారికి ఈ సంవత్సరము మధ్యమ ఫలితము ఉండును. డాక్టరు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటీనటులు ఘణసన్మానములు అందుకొనును. నాట్యకళా రంగస్ధల మరియు వేదపండితులు ఘణసణ్మనములు పొందును. విద్యార్దులకు మంచి ఫలితాలు ఉండుసు. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును


మీరు పూజించే భగవంతుని నామం శ్రీమన్నారాయణ ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమ: అని 27 సార్లు పఠించాలి. అశ్వని వారికి లక్కీ నెంబర్‌ 7,8, లక్కీ స్టోన్‌ వైఢూర్యం ఉంగరం ధరించాలి. భరణి వారికి లక్కీ నెంబర్లు 6,9, లక్కీ స్టోన్‌ వజ్రము, కృత్తిక వారికి లక్కీ నెంబర్లు 1,6,9, లక్కీ స్టోన్‌ కెంపు ఉంగరం ధరించాలి. రాశ్యాధిపతి కుజుడు. అందువలన పగడం కూడా ధరించాలి. మీ సంశయాలకు సంప్రదించే ఫోన్‌ 9704053369.

మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము


శ్లో॥ విశ్వం విష్ణు రవ్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృత్‌ భూతభృద్భావో భూతాత్మ భూతభావనః ॥ (అశ్వ 1పా)
శ్లో॥ పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః।
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో2 క్షర ఏవ చ॥ (అశ్వ 2పా)
శ్లో॥ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః।
నారసింహవపు శ్శ్రీమాన్‌ కేశవః పురుషోత్తమః॥ (అశ్వ 3పా)
శ్లో॥ సర్వ శ్శర్వ శ్శివ స్థ్సాణుః భూతాది ర్నిధి రవ్యయః ।
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభు రీశ్వరః॥ (అశ్వ 4పా)
శ్లో॥ స్వయమ్భూ శ్శమ్భు రాదిత్యః పుష్క రాక్షో మహాస్వనః।
అనాది నిధనో ధాతా విధాతా ధాతురుత్తమః॥ (భరణి 1 పా)
శ్లో॥ అప్రమేయో హృషీకేశః పద్మనాభో2 మరప్రభు ।
విశ్వకర్మా మనుస్త్వష్టా ప్థవిష్ఠః స్థవిరో ధ్రువః॥ (భరణి 2పా)
శ్లో॥ అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః।
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్‌ ॥ (భరణి 3పా)
శ్లో॥ ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూరగ్భో మాధవో మధుసూదన ః। (భరణి 4పా)
శ్లో॥ ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞ కృతిరాత్మవాన్‌ ॥ (కృత్తిక 1పా)
Back to top