Do you wanna know more about your career, Horoscope, Health predictions.
Contact Us!శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర కర్కాటక రాశి గోచార ఫలము
మాఘ 1,2,3,4 పాదము, పుబ్బా 1,2,3,4 పాదము, ఉత్తర 1వ పాదం
మా, మి, ము, మే, మో, ట, టి, టూ, టే అక్షరాు కసి సింహరాశి ఆగును.
ద్వంద్వాక్షర పేర్లు : మైనావతి, మౌనిశ్వర్, మౌక్తికము, స్మైల్, స్టాల్, ష్టల్
శనివారం ఘాతవారం. ఆధాయం 05, వ్యయం 14, రా.పూజ్యం 01, అవమానం 05
ఈ రాశివారి జాతక లక్షణాలు అమరశీుడు. విశామైన ముఖవర్చస్సు గలవారు. గుండ్రని ముఖము కలవారు. స్వల్ప సంతానము కలవారు. స్త్రీ యందు కోపము, మధుమాంసముయందు ఇష్టము గలవారు. మంచి పనులు, ధర్మ కార్యము చేయువారు. పరాక్రమవంతుడు, నిశ్చమైన, పవిత్రమైన మనస్సు గలవారు. తల్లిదండ్రుల మాట, గురువుల మాట, పెద్ద మాట వినువారు. శ్రీమంతునివలె కన్నించును. పిండి వంటలు, మధుర పదార్థాములు భుజించువారు. చదువుల యందు శ్రద్ధ, పూతోటు, బృందావనం అంటే ఇష్టం కలవారు. సదాచారవంతులు, ఆధ్యాత్మిక చింతనగలవారు. జ్యోతిష్యం వాస్తు ప్రశ్నబాగం వైద్యం భగవద్గీత తెలిసిన వారు అగును.
ఈ జాతకులకు 06-04-2019 శనివారం నుండి 05-11-2019 మంగళవారం వరకు గురుడు 4వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.
శ్లో॥ యాచనం బుద్ధిచాంచ్యం తేజోహాని ధనా వ్యయం। దేశత్యాగంశ్చ కలాహం చతుర్ధస్థానకే ద్గురౌ ॥
గృహ సంబందమైన సమస్యలు వాహన ప్రమాదము జరుగును. తల్లికి అనారోగ్యము సంభవించుటయు దరిద్రము సంభవించుటయు స్థిరత్వము లేక పోవుటయు అపకీర్తియు ధనవ్యయము కలుగుటయు, స్థానచలనము కలుగుటయు. ఉద్యోగులకు దూర ప్రాంతము బదిలీలు కలుగుటయు విద్యార్థులకు ఆశించిన స్థాయిలో మార్కులు రాకుండుటము ఉన్నత విద్యాభ్యాసమునకు ఆటంకము కలుగుటయు జరుగును. శని గ్రహ, గురుగ్రహ శాంతించుటకు
1- 1/4 కిలో శనిగు గురువారం పురోహితునికి దానం ఇవ్వండి. గ్రహాలు శాంతించి అన్ని విధాల శుభం జరుగును.
06-04-2019 శనివారం నుండి 25-01-2020 శనివారం వరకు శని 5వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు
శ్లో॥ కార్యహాని మనస్థాపం జ్ఞాతివ్యాసకలా పకం। హీణస్త్రీబోగ సంతాపం. పంచమాస్థే భవేశ్చనౌ॥
శుభ కార్యక్రమములు చేయుట వలన ధన వ్యయము పాడి పరిశ్రమ అనుకూలించక పోవుట స్థానచలనము ఉద్యోగులకు బదిలీలు తరుచు ప్రయాణము అప్పు చేయుట మలిన వస్త్రధారణ చేయుట మరియు కుటుంబ చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నవి వాయిదాపడుట మనకు రావలసిన డబ్బు రాకపోవుడ ఇచ్చేకాడ సతాయించడం జరుగును. ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవడం అనారోగ్యము కలుగును. శతృభయం, దృష్ఠిదోషం ఉన్నది దుర్గ యంత్రం ప్రతిష్టించుకోండి.
శ్లో|| అర్ధలాభం తదైశ్వర్యం, కర్మరతిహర్షతమ్ | సదాస్వజన సౌఖ్యంచ, పంచమాస్తే భవేద్గురౌ ||
సంతానాభివృద్ధి కలుగుట, సంతానమునకు శుభకార్యములు జరుపుట , ధనలాభము కలుగుట, మంత్రసిద్ధి కలుగుట, అయాచితముగా సంపద వచ్చుటయు వృత్తి ఉద్యొగ వ్యాపారాదుల యందు అభివృద్ధి యు , పై అధికారుల మన్నలను పొందుట, కుతుంబముతో మహా సంతోషముతొ ఉండుట దేవతా కార్యములు జరిపించుట మొదలగు శుభ ఫలితములు కలుగును .
శ్లో॥ధనధాన్యాది వృద్ధ్యంచ్చ బంధు సంతోష వర్ధనం । స్త్రీసౌఖ్యం గృహనిర్మాణం షష్ఠమాస్తానకే శనౌ ॥
ఆరోగ్యవృద్ధి తలచిన పనులు నెరవేరుటయు నూతన గృహనిర్మాణము చేపట్టుటయు బందుమిత్రల సంతోషము, స్త్రీ సౌఖ్యము, సంతోషము, సౌభాగ్యము, శరీరబలము, కీర్తి, ప్రజలలో పలుకుబడి పెరుగుటయు, విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అగుటయు జరుగును. అన్ని వృత్తుల వారికి ధనలాభం కలుగును. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానము అందుకోనును. నాట్యకళా రంగస్థల మరియు వేదపండితులు ఘణసన్మానము పొందును. విద్యార్ధులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః।
అనుకూ శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ (మఘ 1 పా)
శ్లో॥ పద్మనాభో2 రవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్ ।
మహర్ధిః బుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః॥ (మఘ 2 పా)
శ్లో॥ అతుశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।
సర్వ క్షణ క్షణ్యో క్ష్మీవాన్ సమితిఞ్జయః॥ (మఘ 3 పా)
శ్లో॥ విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర స్సహః ।
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ (మఘ 4 పా)
శ్లో॥ ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ (పుబ్బ 1 పా)
శ్లో॥ వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ద్రువః।
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ (పుబ్బ 2 పా)
శ్లో॥ రామో విరామో విర (జో) మార్గో నేయో నయో2 నయః ।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదత్తమః ॥ (పుబ్బ 3 పా)
శ్లో॥ వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ (పుబ్బ 4 పా)
శ్లో॥ ఋతుస్సుదర్శనః కాః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ ః ॥ (ఉత్తర 1 పా)



