Do you wanna know more about your career, Horoscope, Health predictions.
Contact Us!శ్రీ మహావిష్ణు జ్యోతిష వాస్తు ప్రశ్నాలయం
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మిధున రాశి గోచార ఫలము
మృగశిర 3, 4 పాదము, ఆరుద్ర 1, 2, 3, 4 పాదము, పునర్వసు 1, 2, 3 పాదము కా, కీ, కూ, ఘ, జ్ఞ, ఛ, కే, కొ, హ అక్షరాలు మిధున రాశి అగును. సోమవారం ఘాతవారం. ద్వంద్వాక్షర పేర్లు : కౌంశికుడు, కౌంసల్యా, కైకేయి, కైక, కృష్ణుడు కృష్ణమూర్తి కృష్ణ కృపాకర్, క్రాంతికుమార్, జ్ఞానేందర్, జ్ఞానేశ్వరి, కైంకరి, కైలాసం, జ్ఞాని మిధునరాశి అగును
ఆధాయం 11, వ్యయం 05, రా.పూజ్యం 02, అవమానం 02
ఈ మిధున రాశి జాతకుల లక్షణాలు స్త్రీ యందు ప్రేమాభిమానము గలవారు. కామశాస్త్రం యందు శ్రద్ధ చూపు వారు. బుద్ధి చపలచిత్తం, హాస్యప్రియుడు, నవ్వు ముఖము గలవారు. దీర్ఘమైన నాసికము కలవారు. తల్లిదండ్రులను, గురువును పూజించువారు.
ఈ రాశి జాతకులకు 06-04-2019 శనివారము ఉగాది నుండి 05-11-2019 మంగళవారము వరకు గురుడు 6వ స్థానంలోను ఉండుటవలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును
శ్లో" ధారపుత్ర విరోధశ్చ స్వజనే కలహం స్తదా ! చోరాగ్ని నృప్ర భీతిశ్చ షష్టమాష్తేభవే ద్గురౌ" !!
చేయువృత్తి ఉద్యోగ, వాపారాదుల యందు అభివృధ్ధి ఆగిపోవుట స్వజసులతో విరోదము, శత్రుసంఖ్య పెరుగుట చోర, అగ్ని, రాజ భయము కలుగుట అపకీర్తి మనస్థపము వేళకు భోజనము చేయలేక పోవుటయు అనారోగ్యము సంభవించుటయు శరీరమున వాతరోగము ప్రభలుటయు తలచిన కార్యములు చెడిపోవుటయు మొదలగు చెడు ఫలితములు కలుగును. శనికి తైలాభిషేకం చేస్తే గ్రహాలు శాంతించును. విష్ణుసహస్రనామాలు, నరసింహ కవచము సూర్య నమస్కారం చేయుట వలన శుభం
06-04-2019 శనివారము నుండి 25-01-2019 శనివారము వరకు శని 7వ స్థానంలో ఉండుటవలన కలిగే ఫలితాలు.
శ్లో॥వ్యాధిపీడ ప్రవాసంచ అంతక్లేశం మహద్భయం । అపమృత్యు భయం ప్రాప్తి అర్థాష్టమ స్థానకే శనౌ ॥
శుభ కార్యక్రమములు చేయుట వలన ధన వ్యయము పాడి పరిశ్రమ అనుకూలించక పోవుట స్థానచనము ఉద్యోగుకు బదిలీలు తరుచు ప్రయాణము అప్పు చేయుట మలిన వస్త్రధారణ చేయుట మరియు కుటుంబ చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నవి వాయిదాపడుట మనకు రావసిన డబ్బులు రాకపోవుడం ఇచ్చేకాడ సతాయించడం జరుగును. ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవడం అనారోగ్యము కలుగును. శతృభయం, దృష్ఠిదోషం ఉన్నది దుర్గ యంత్రం ప్రతిష్టించుకోండి.
05-11-2019 మంగళవారము నుండి శార్వరి నామ సంవత్సర ఉగాది వరకు గురుడు 7వ స్థానంలో ఉండుటవలన కలిగే ఫలితాలు.
శ్లో” రాజుదర్శనమారోగ్యం గాంభీర్యం గాత్రపోషణం ! అభిప్టకార్యసిద్దిచ్ఛ సప్తమాస్తే భవేద్గు రౌ" !!
రాజకీయ వ్యవహారములలో జయము, ఆరోగ్యము కలుగుటయు తేజము, ధనధాన్య లాభము తలచిన పనులు నెరవేరుటయు సంఘములో మంచి పేరు వచ్ఛుటయు ఉద్యోగాస్తులకు ఉద్యోగము లభించుటయు వివాహము కాని వారికి వివాహము జరుగుటయు మొదలగు శుభ ఫలితములు కలుగును. అన్ని వృత్తులవారికి ఆనందదాయకం.
శ్లో" నానాకార్య విరోదశ్చ వ్యాదిపీఢాధనక్షయం, అపమృత్యు భయప్రాప్తి అప్టమస్తే యదాశనౌ”!!
మనోవిచారము సోదరులతో విరోదము బంధువిరోధము, ధనముగూర్ఛి ఇబ్బందులు పడుటయు ధైర్యము సన్నగిల్లుటయు వ్రతిపనికి భయవడుటయు కోర్టు వ్యవహారాదులు అనుకూలించకుండుటయు అదృష్టమునకు దూరమగుటయు, భార్యతో మనస్పర్ధలు వచ్ఛుటయు శరీరము సహజత్వము కోల్పోవుట కుటుంబ చిక్కులు, ఆర్దిక ఇబ్బందులు, అనుకున్న పనులు వాయిదా పడటము జరుగును, ప్రయాణములో చాలా జాగ్రత్త అవసరము, శని ఈ సంపత్సరమంతా ధసస్సు రాశిలో ఉస్నందున శనికి తైలాభిషేకం శనిధానము ఇచ్చిన శాంతించును.
మీరు నిత్యం పఠించే మంత్రం ఓం క్లీం కృష్ణాయ నమః అని రోజు 27 సార్లు పఠించాలి
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।
అనిద్దేశ్వవపుః శ్రీమాన్ అమేయాత్యా మహాద్రిధృత్ ॥ (మృగ 3 పా)
శ్లో॥ మహేష్వాసో మహిభర్తా శ్రీనివాస స్సతాంగతిః ।
అనిరుద్ధ స్సురాసన్దో గోవిన్దో గోవిందాంపతిః ॥ (మృగ 4 పా)
శ్లో॥ మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః॥ (ఆర్ద్ర 1పా)
శ్లో॥ అమృత్యు స్సరదృక్సింహః సన్ధాతా సన్ధిమాన్ స్ధిరః ।
అజోదుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ (ఆర్ద్ర 2 పా)
శ్లో॥ గురు ర్గురుతమో ధామః సత్య స్సత్య పరాక్రమః ।
నిమిషో2 నిమిస స్స్రగ్వీ వాచస్పతి రుదారధీ ః ॥ (ఆర్ద్ర 3 పా)
శ్లో॥ అగ్రణీర్గ్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః।
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ (ఆర్ద్ర 4 పా)
శ్లో॥ ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్ధనః ।
అహస్సంవర్తకో వహ్ని ః అనిలో ధరణీధర ః ॥ (పునర్వపు 1పా)
శ్లో॥ సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతస్సాధుః జహ్నుర్నారాయణోనరః ॥ (పున 2 పా)
శ్లో॥ అసంఖ్యేయో 2 ప్రమోయాత్మా విశిష్ట శ్శిష్టకృచ్ఛువిః ।
సిద్ధార్థః స్సిద్ధసఙ్క్పః సిద్ధిద స్సిద్ధిసాధనః ॥ (పునర్వసు 3 పా)



